23.7 C
Hyderabad
Monday, September 30, 2024

నేడు రాజ్యసభ ఎన్నికల పోలింగ్… ఉత్కంఠ రేపుతున్నఎన్నికలు!

న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. రేపు 16 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తక్కువ సీట్లకు ఎక్కువ మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తం 15 రాష్ట్రాల్లో 57 స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. వారిలో 11 రాష్ట్రాల నుంచి 41 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, హర్యానా నుంచి మిగిలిన 16 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఓపెన్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్ నిర్వహిస్తారు. రాజ్యసభ ఎన్నికల్లో నోటా ఆప్షన్ ఉండదు.

ఎన్నికల నిర్వహణకు ఈసీ ఎన్నికల పరిశీలకులను నియమించింది. ఎన్నికల ప్రక్రియను వీడియో తీయాలని ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాలతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో బలం తగ్గనుంది. అలాగే, ఇటీవలే పెద్దల సభలో 100 మార్కు చేరుకున్న భాజపా బలం సైతం నూరులోపే పరిమితం కానుంది. ప్రస్తుతం ఎన్నికల్లో గెలుపొందే వారంతా జులైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనున్నారు.

ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో తమ ఎమ్మెల్యేలు చేజారి పోకుండా ఉండేందుకు పార్టీలు వారిని రిసార్టులకు తరలించాయి. కాగా, ఈ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, కాంగ్రెస్ నేతలు రణ్ దీప్ సూర్జేవాలా, జైరాం రమేశ్, ముకుల్ వాస్నిక్, శివసేనకు చెందిన సంజయ్ రౌత్ భవితవ్యం తేలనుంది. రాజస్థాన్ లో ఇప్పటికే రిసార్ట్ రాజకీయాలు జరుగుతున్నాయి. రాజస్థాన్లో 4 స్థానాలకు పోటీ ఏర్పడడంతో బీజేపీ ఎమ్మెల్యేలను జైపూర్ లోని దేవీ రతన్ రిసార్టుకు తరలించింది అధిష్టానం. ఇటు కాంగ్రెస్ కూడా తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది.

రెండు స్థానాలున్న హరియాణాలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ ఓ అభ్యర్థి గెలవాలంటే 31 ఓట్లు కావాలి. సరిగ్గా అంతే బలం ఉన్న కాంగ్రెస్ నుంచి అజయ్ మాకెన్ బరిలోకి దిగుతున్నారు. ఆ స్థానాన్ని కాంగ్రెస్కు దక్కనీయకుండా చేసేందుకు ఇక్కడా మరో మీడియా అధిపతి కార్తికేయ శర్మ స్వతంత్రంగా బరిలోకి దిగారు. ఇక్కడ భాజపా ఆయనకు మద్దతిస్తోంది. దీంతో రాజస్థాన్, హరియాణాలోని రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా భాజపా నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.

కర్ణాటకలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కర్ణాటకలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. జేడీఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు మాజీ ప్రధాని దేవెగౌడ రంగంలోకి దిగారు. ఇప్పటికే ఆయన సోనియా గాంధీతో ఫోన్లో చర్చలు జరిపారు. మహారాష్ట్రలో కూడా రాజకీయం రోజురోజుకు వేడెక్కుతుంది. ఇప్పటికే అధికార పార్టీ శివసేన తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది.

• ఏపీ నుంచి బీజేపీ నేతలు సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టి.జి. వెంకటేష్‌ల పదవీకాలం ముగియనుంది.
• పంజాబ్‌లో ఆప్ అధికారంలో ఉండడంతో ఈసారి రెండు స్థానాలనూ ఆ పార్టీనే గెలుచుకోనుంది. ఫలితంగా అక్కడి నుంచి           కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలు ప్రాతినిధ్యం కోల్పోనున్నాయి.
• బహుజన్ సమాజ్ పార్టీ పెద్దల సభలో ఒక్క స్థానానికే పరిమితం కానుంది.
• ఉత్తప్రదేశ్‌లో 11 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఎనిమిదింటిని భాజపా, దాని మిత్రపక్షాలు, మూడింటిని ఎస్పీ     గెలుచుకోనున్నాయి.

మొత్తంగా బిజెపి ఎగువ సభలో 100 మార్కును దాటగలిగింది, 1990 తర్వాత వందసీట్లు పొందని మొదటి పార్టీగా అవతరించింది. అయినప్పటికీ, రాష్ట్రపతి ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికలు మెజారిటీ పెంచుకోవడానికి సహాయపడతాయని భావిస్తున్నారు. గత రాష్ట్రపతి ఎన్నికలు జరిగిన 2017 నుంచి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రపతి పాలనలోకి వెళ్లింది. మరో మూడు రాష్ట్రాలు – రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ మరియు తమిళనాడు — ప్రతిపక్షాల చేతుల్లో ఉన్నాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles