24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

జర్నలిస్ట్​ ముహమ్మద్ జుబైర్‌ అరెస్ట్​… కేంద్రంపై మండిపడ్డ ప్రతిపక్ష నేతలు!

న్యూఢిల్లీ: ఫ్యాక్ట్‌ చెక్‌ వెబ్‌సైట్‌ “ఆల్ట్‌ న్యూస్‌”సహ వ్యవస్థాపకుడు జర్నలిస్ట్ మహ్మద్ జుబైర్‌ను సోమవారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఓ మతానికి చెందిన వారి మనోభావాలను దెబ్బతీశారని, శత్రుత్వాన్ని ప్రేరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఐపిసి సెక్షన్లు 153, 295 కింద మహ్మద్ జుబైర్‌ను అరెస్టు చేశారు. జుబైర్ u/s 153A/295A IPC నమోదైన కేసుకు సంబంధించి దర్యాప్తునకు పిలిచామని… “తగిన సాక్ష్యాలు ఉన్నందున అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

జుబైర్‌ అరెస్ట్‌ను ఆల్ట్‌ న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్‌ సిన్హా ధ్రువీకరించారు. 2020 నాటి కేసుకు సంబంధించి జుబైర్‌ను దిల్లీ పోలీసులు ప్రశ్నించడానికి పిలిచారని, అయితే ఈ కేసు విషయంలో ఎలాంటి అరెస్టు చేయొద్దని హైకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆల్ట్‌న్యూస్ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా ట్వీట్ చేశారు. అయితే, జుబైర్‌ వేరే ఎఫ్‌ఐఆర్‌లలో అరెస్టు చేశారని.. ఆయా సెక్షన్‌ల పరిధిలో ఆయనకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వలేదని… పదేపదే అభ్యర్థించినప్పటికీ మాకు ఎఫ్‌ఐఆర్ కాపీ ఇవ్వడం లేదు అని సిన్హా ట్వీట్ చేశారు.

ఆయన అరెస్టుపై పలువురు రాజకీయ నేతలు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఢిల్లీ పోలీసులు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నివేదించారు.

తృణమూల్ ఎంపీ మహువా మోయిత్రా ఈ విధంగా ట్వీట్ చేశారు. ఢిల్లీ పోలీసులు “సాహిబ్‌లను మెప్పించడానికి అమాయకులను అరెస్టు చేశారని మండిపడ్డారు. ముహమ్మద్ (స) ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ మాత్రం బీజేపీ రక్షణలో ఉన్నారు.   ముహమ్మద్ జుబేర్‌ను “ట్రంప్డ్ కేసుపై” అరెస్టు చేసినట్లు ఆమె చెప్పారు.

ఒక సత్యవాణిని అరెస్టు చేస్తే మరో వెయ్యి మంది పుట్టుకొస్తారు” అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్ చేశారు.

జర్నలిస్ట్, ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబేర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది అవమానకరం మరియు ఆమోదయోగ్యం కాదు. విద్వేషపూరిత ప్రసంగం చేసిన వ్యక్తి స్వేచ్చగా తిరుగుతుండగా, దాన్ని బయటపెట్టిన జర్నలిస్టును అదుపులోకి తీసుకోవడం ఎంత విడ్డూరం.. అని  కేరళ ఎం.ఎల్.ఏ మునీర్ ట్వీట్  చేశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles