23.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

మళ్లీ పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర!

  • సామన్యుడి జేబుకు చిల్లు
  • మరోసారి పెరిగిన సిలిండర్ ధర
  • ఈరోజు నుంచే కొత్త రేట్లు అమలులోకి

న్యూడిల్లీ : అసలే నిత్యావసర సరుకుల పెరుగుదలతో మధ్యతరగతి, పేదల జీవనం అగమ్యగోచరంగా మారుతుంటే.. సామాన్యుడిపై కేంద్రం మరో ‘బండ’ పడేసింది. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల గ్యాస్‌ ధరను 50రూపాయలు పెంచింది.  దిల్లీలో ప్రస్తుతం రూ.1003గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర తాజా పెంపుతో రూ.1053కు చేరుకుంది. హైదరాబాద్‌లో గ్యాస్‌ బండ ధర రూ.1055 నుంచి రూ.1105కు చేరింది.  పెంచిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు ప్రకటించాయి. ఇటీవల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచిన కేంద్రం.. ఇప్పుడు సామాన్యులపై మరోసారి భారం వేసింది. ఏడునెలల కాలంలో ఎల్పీజీ సిలిండర్ పై రూ. 325 పెరిగింది. దీంతో సామాన్యుడి జేబుకు మరోసారి చిల్లు పడినట్టైంది.

సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ నెల 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధరను చమురు సంస్థలు ₹183.50 మేర తగ్గించాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది కదా? మరి 14.2 కేజీల సిలిండర్ ధర తగ్గలేదేంటని చాలా మంది అనుకునే ఉంటారు. అయితే ఇప్పుడు తగ్గింపు సంగతి ఏమో కానీ.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వంట గ్యాస్ ధరను మరోసారి పెంచేశాయి. దీంతో సామాన్యులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles