28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

గుజరాత్‌లో రూ. 40కే కల్తీ మద్యం విక్రయం … 37కు చేరిన మృతులు!

  • గుజరాత్‌లో 37మంది ప్రాణాలు తీసిన విషాద ఘటన
  • రూ. 40కే కల్తీ మద్యం విక్రయం
  • మిథైల్ ఆల్కహాల్‌తో మద్యం తయారీ
  • 14మంది నిందితులను అరెస్టు
  • విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం

అహ్మదాబాద్: గుజరాత్‌లోని బోటాడ్ జిల్లాలో కల్తీ మద్యం తాగి… మరణించిన వారి సంఖ్య 37కు చేరింది. భావ్​నగర్​, బోటాడ్​, బర్వాలాలోని ఆసుపత్రుల్లో 70 మందికిపైగా చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. వీరిలో కొందరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. 40 రూపాయల విలువైన కల్తీ మద్యం 37మంది ప్రాణాలను బలిగొన్న విషాదం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది.

అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్‌తో తయారు చేసిన మద్యాన్ని రోజిద్ గ్రామం, సమీప ప్రాంతాల్లోని స్థానికులకు నాటు సారా విక్రేతలు దీన్ని అమ్మినట్టు పోలీసుల విచారణలో తేలింది. అక్కడ తయారైన మద్యాన్ని చిన్న ప్లాస్టిక్ సంచుల్లో విక్రయించారు. ఒక ప్యాకెట్ ధర రూ. 40. స్థానికంగా దీన్ని ‘పొట్లీ’ అని పిలుస్తారు, కేవలం రూ. 40 విలువైన ఈ కల్తీసారా బోటాడ్‌లో 37 మందిని అన్యాయంగా పొట్టనపెట్టుకుంది. దీని దెబ్బకు చాలా మంది ప్రాణాలతో పోరాడుతున్నారు.

మృతులందరూ మిథనాల్‌ సేవించినట్టు వారి రక్తనమూనాల విశ్లేషణలో వెల్లడైందని గుజరాత్‌ డీజీపీ అశిష్‌ భాటియా వెల్లడించారు. కల్తీ సారా విక్రయించిన 14మంది నిందితులను అరెస్టు చేసినట్టు డీజీపీ తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. విచారణకు సిట్​ను ఏర్పాటు చేసింది. గుజరాత్ టెర్రరిజం స్క్వాడ్, అహ్మదాబాద్​ క్రైం బ్రాంచ్ కూడా ఈ దర్యాప్తులో భాగమయ్యాయి.

పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బొటాడ్‌లోని నాటు సారా విక్రేతలు నీటిలో మిథైల్ ఆల్కహాల్ కలపడం ద్వారా కల్తీ మద్యాన్ని తయారు చేశారు, ఆపై దానిని స్థానికులకు 40 రూపాయలకు చిన్న చిన్న పాకెట్లలో విక్రయించారు. ఓ పోలీస్‌ అధికారి మాట్లాడుతూ… “ఇటువంటి పొట్లీలు ఎక్కడైనా రూ. 25 నుండి రూ. 50 వరకు అమ్ముడవుతాయి. నిన్న ఈ పొట్లీలు ఒక్కొక్కటి రూ. 40 చొప్పున విక్రయించారు. చాలా మంది వ్యక్తులు ఒక సింగిల్ పొట్లీ తాగిన తర్వాత మరణించారని తెలిపారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles