33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

విద్యుత్ సవరణ బిల్లు 2022…. వ్యతిరేకించిన 27 లక్షల మంది ఉద్యోగులు… నేడు దేశవ్యాప్త నిరసన!

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 27 లక్షలమంది ఉద్యోగులు  పెద్దఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చారు. తెలంగాణలోనూ విద్యుత్ సవరణ చట్టంపై విద్యుత్ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. కేంద్రం తీసుకొస్తున్న సవరణలపై నేడు మహాధర్నా చేపట్టారు.  డిస్కంల ప్రైవేటీకరణ చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ చట్టం 2021 ప్రైవేటు సంస్థలకు అనుకూలంగా ఉందని ఆరోపిస్తున్నారు. గతంలో తీసుకొచ్చిన చట్టాన్నే కాస్త మార్చి కేంద్రం తప్పుదోవపట్టిస్తోందని విద్యుత్ ఉద్యోగులు మండిపడుతున్నారు.

ఇటు ఏపీలో ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు సాగాయి. కేంద్రం ప్రవేశపెట్టనున్న విద్యుత్‌ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ … విద్యుత్‌ కార్మికుల సంఘం పిలుపుమేరకు రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి.  నేటి  ఉదయం జెఎసి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం డాక్టర్‌ నార్ల తాతారావు అధ్యక్షతన ధర్మవరం పవర్‌ స్టేషన్‌ సమీపాన పాత గేటు వద్ద విద్యుత్‌ కార్మికులు ఆందోళన నిర్వహించారు.

తాజాగా కేంద్రం తీసుకొచ్చిన అమెండ్‌మెంట్‌లో డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేయాలంటే కచ్చితంగా డీ లైసెన్సింగ్ అవసరమని, దీనికి సొంత లైన్ అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న కరెంట్ లైన్లనే వాడుకోవచ్చని చట్టం చెబుతోంది. ఇలా బిజినెస్ చేయడానికి ముందుకొచ్చే వారికి కచ్చితంగా అనుమతి ఇవ్వాల్సిందేనని కేంద్రం ఇందులో పేర్కొంది. దీనివల్ల ఎవరైనా వ్యక్తులు ప్రస్తుతం ఉన్న లైన్ల ద్వారానే విద్యుత్ సరఫరా వ్యాపారం చేసుకోవచ్చనే అర్థం ఉందని దీనివల్ల రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలైన డిస్కంలు తీవ్రంగా నష్టపోతాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని రాష్ట్రాలకు ఉన్న అధికారాలను నీరుగార్చేలా ఉన్న బిల్లును మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ చట్ట సవరణ వల్ల వినియోగదారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేస్తున్నారు.

ప్రభుత్వం ఏకపక్షంగా ఈ బిల్లును ఆమోదించినట్లయితే మ‌రోసారి దేశ‌వ్యాప్త ఉద్య‌మం ఉద్య‌మం చేస్తాం” అని రైతు సంఘాలు (SKM) ‌కేంద్రాన్ని హెచ్చరించింది.  ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ (AIPEF) విస్తృత సంప్రదింపుల కోసం బిల్లును  పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేసింది.

ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ (AIPEF) చైర్మన్ శైలేంద్ర దూబే మాట్లాడుతూ, తాజాగా కేంద్రం తీసుకొచ్చిన అమెండ్‌మెంట్‌లో డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేయాలంటే కచ్చితంగా డీ లైసెన్సింగ్ అవసరమని, దీనికి సొంత లైన్ అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న కరెంట్ లైన్లనే వాడుకోవచ్చని చట్టం చెబుతోంది. ఇలా బిజినెస్ చేయడానికి ముందుకొచ్చే వారికి కచ్చితంగా అనుమతి ఇవ్వాల్సిందేనని కేంద్రం ఇందులో పేర్కొంది. దీనివల్ల ఎవరైనా వ్యక్తులు ప్రస్తుతం ఉన్న లైన్ల ద్వారానే విద్యుత్ సరఫరా వ్యాపారం చేసుకోవచ్చు. దీనివల్ల రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలైన డిస్కంలు తీవ్రంగా నష్టపోతాయని దూబే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్ సవరణ బిల్లు 2021లోని ముఖ్యమైన అంశాలు ఇవే..

1) ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ పంపిణీ సంస్థలకు సబ్సిడీ ఇస్తాయి. దీని తర్వాత కంపెనీలు విద్యుత్ రేట్లను నిర్ణయిస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం ఈ సబ్సిడీని నిలిపివేస్తే ఏమవుతుంది? దీని ప్రభావం విద్యుత్ ధరలపైనా పడనుంది.

(2) మీ ఇంటికి విద్యుత్ సరఫరా చేసే కంపెనీలు తాము భారీ నష్టాల్లో ఉన్నామని క్లెయిమ్ చేస్తున్నాయి. పీఐబీ (PIB) నివేదిక ప్రకారం, 2020-21 ఆర్ధిక సంవత్సరంలో డిస్కమలు మొత్తం 90,000 కోట్ల రూపాయల నష్టాన్ని కలిగి ఉంటాయని అంచనా.

(3)ప్రభుత్వం ద్వారా సబ్సిడి ఆలస్యం అవుతుంది. దీని ప్రభావం విద్యుత్ పంపిణీ సంస్థలపై కూడా పడుతుంది. ఇప్పుడు కొత్త విధానం అమల్లోకి వస్తే కంపెనీలు ధరలను పెంచే అవకాశం ఉంది. అప్పుడు దాని పూర్తి ప్రభావం మీ జేబుపై ఉంటుంది. అయితే, మీ ఖాతాలో నేరుగా సబ్సిడీని ఇవ్వడం ద్వారా ప్రభుత్వం దానిని భర్తీ చేస్తుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లును రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది తమపై పెను ప్రభావం. చూపుతుందని రైతు సంఘాలు భావిస్తున్నాయి. ఇక ఈ సెషన్లో ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదింపజేసుకోగలుగుతుందా.. లేదా అనేది వేచి చూడాలి.

(4) కొత్త చట్టంతో కొన్ని సవాళ్లు ఉన్నాయి. భూమి యజమాని, యజమాని, దుకాణం పేరు మీద కనెక్షన్ ఉంది. కౌలుదారు విషయంలో ఎవరికి రాయితీ వస్తుందో స్పష్టత లేదు.

మొత్తంగా విద్యుత్ వినియోగాన్ని బట్టి సబ్సిడిని నిర్ణయిస్తారు. కాబట్టి 100% మీటరింగ్ అవసరం. చాలా రాష్ట్రాల్లో మీటర్ లేకుండానే కరెంటు ఇస్తున్నారు. మహారాష్ట్రలో 15 లక్షల మంది వ్యవసాయ వినియోగదారులు మీటర్ లేకుండా విద్యుత్ పొందుతున్నారు. మొత్తం వ్యవసాయ వినియోగదారులలో వీరు 37%. సబ్సిడీ బదిలీలో జాప్యం జరిగితే వినియోగదారులు ఇబ్బంది పడతారు. ‘PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ ‘ ప్రకారం, వ్యవసాయ వినియోగదారుని సగటు నెలవారీ బిల్లు 5 వేల వరకు ఉంటుంది. ఇప్పుడు ఉచిత కరెంటు పొందుతున్న వారికి ఈ మొత్తం భారీగానే ఉంటుంది.

“విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో 85 శాతం ఖర్చు ఉంటుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు 25 సంవత్సరాల వ్యవధి ఉంటుంది, కాబట్టి విద్యుత్ ఖర్చు తగ్గదు. అందువల్ల వినియోగదారులకు పోటీ, చౌకైన విద్యుత్ వాగ్దానం ఒక ప్రహసనం” అని ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ (AIPEF) చైర్మన్ శైలేంద్ర దూబే వివరించారు.

 

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles