28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

మోదీకో  హఠానా హై… ఆర్‌జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్ యాదవ్!

పాట్నా: బీహార్‌లో రాజకీయాలు పరిణామాలు ఇటీవల ఒక్కసారిగా మారాయి. ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ జేడీయూతో కలిసి అధికారాన్ని పంచుకుంది. ఈ పరిణామాల అనంతరం ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తొలిసారి ఢిల్లీ నుంచి బీహార్‌కు వచ్చారు.  కేంద్రంలోని “నియంతృత్వ” ప్రభుత్వాన్ని నిందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గద్దె దింపాలని అన్నారు.

పార్టీ నేతలు, కార్యకర్తలతో పాట్నాలో బుధవారం లాలూ ప్రసాద్ యాదవ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఆయనను పలు ప్రశ్నలు అడిగారు. 2024 పార్లమెంట్‌ ఎన్నికలపై మీడియా ప్రశ్నించగా… ‘నియంతృత్వ ప్రభుత్వాన్ని దించాలి. మోదీకో  హఠానా హై… హఠానా హై’ అని లాలూ వ్యాఖ్యానించారు.

లాలూ ప్రసాద్ బుధవారం ఢిల్లీ నుండి పాట్నాకు తిరిగి వచ్చి, మొదటిసారి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను కలిశారు. వీరిద్దరు నేతల కలిసిన ఫోటోలను ఉప ముఖ్యమంత్రి, లాలూ తనయుడు తేజస్వీయాదవ్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.  “గౌరవనీయ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జీ జాతీయ అధ్యక్షుడు (ఆర్జేడీ) లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలవడానికి చేరుకున్నారు” అని తేజస్వి ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమంలో తేజ్ ప్రతాప్ యాదవ్, రబ్రీ దేవి కూడా పాల్గొన్నారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు నితీష్ కుమార్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో మాట్లాడి రాజకీయ పరిణామాలపై చర్చించారు. నితీష్, అతని డిప్యూటీ  తేజస్వి యాదవ్ ఆగస్టు 10 న ప్రమాణ స్వీకారం చేశారు.

అంతకుముందు, నితీష్ కుమార్ బిజెపితో పొత్తును కాదని, లాలూ యాదవ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్‌డిఎ నుండి విడిపోయి, మహాఘట్‌బంధన్‌తో తిరిగి కలవాలన్న నితీఫ్ నిర్ణయాన్ని లాలూ ప్రశంసించారు.

దాణా కుంభకోణం కేసులో గత ఏడాది ఏప్రిల్‌ నుంచి బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన లాలూ ప్రసాద్‌ జూలైలో భుజం ఫ్రాక్చర్‌తో న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. జూలై 22న డిశ్చార్జ్ అయ్యారు.

రాష్ట్రంలో మహాఘటబంధన్ లేదా మహాకూటమిలో భాగమైన వివిధ పార్టీల నుండి మొత్తం 31 మంది మంత్రులు బీహార్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆగస్టు 16న రాజ్‌భవన్‌లో బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆర్జేడీకి 16 మంత్రి పదవులు లభించగా, జనతాదళ్ (యునైటెడ్)కు 11 మంత్రి పదవులు లభించాయి.

ఆర్జేడీ నుంచి ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్, సమీర్ కుమార్ మహాసేత్, చంద్రశేఖర్, కుమార్ సర్వజీత్, లలిత్ యాదవ్, సురేంద్ర ప్రసాద్ యాదవ్, రామానంద్ యాదవ్, జితేంద్ర కుమార్ రాయ్, అనితా దేవి, సుధాకర్ సింగ్, అలోక్ మెహతా ప్రమాణం చేశారు.

కాంగ్రెస్ శాసనసభ్యులు అఫాక్ ఆలం, మురారి లాల్ గౌతమ్‌లు మంత్రివర్గంలోకి వచ్చారు. హిందుస్తానీ అవామ్ మోర్చా నేత సంతోష్ సుమన్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

బీహార్ మహాకూటమి మొత్తం బలం 163. స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ సింగ్ నితీష్ కుమార్‌కు మద్దతు ఇవ్వడంతో దాని ప్రభావవంతమైన బలం 164కి చేరుకుంది. ఆగస్టు 24న బీహార్ అసెంబ్లీలో కొత్త ప్రభుత్వం మెజారిటీని నిరూపించుకునే అవకాశం ఉంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles