23.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించిన గులాం నబీ అజాద్!

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటికొచ్చిన తర్వాత  సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ మాటల తుటాలు పేలుస్తున్నారు. మూడురోజుల క్రితం రాజీనామా చేసిన ఆజాద్… రాహుల్ గాంధీపై  విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కేవలం ఫోటోలు,  ధర్నాలు చేసేందుకే పనికొస్తారని, పార్టీ  కోసం మాత్రం కాదని అన్నారు. రాహుల్‌ గాంధీ తీరు వల్లే పార్టీని వీడినట్లు ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే సీడబ్ల్యూసీకి అర్థమే లేకుండా పోయిందని ఆజాద్ విమర్శించారు. గతంలో సీడబ్ల్యూసీలో కేవలం సీడబ్ల్యూసీ మెంబర్లు మాత్రమే ఉండేవారని… కానీ, గత పదేళ్లలో 25 మంది సీడబ్ల్యూసీ మెంబర్లతో పాటు, 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు కూడా ఉంటున్నారని అన్నారు.

1998 నుంచి 2004 వరకు సోనియాగాంధీ ప్రతి విషయంలో సీనియర్లను సంప్రదించేవారని, సీనియర్లు ఇచ్చే సలహాలను, సూచనలను ఆమె స్వీకరించేవారని చెప్పారు. 2004 నుంచి ఆమె సీనియర్లను పక్కన పెట్టేసి, పూర్తిగా రాహుల్ పై ఆధారపడటాన్ని ప్రారంభించారని తెలిపారు. ప్రతి ఒక్కరు రాహుల్ కు సహకరించాలని చెప్పేవారని అన్నారు. రాహుల్ కు రాజకీయాలను నడిపే శక్తిసామర్థ్యాలు లేవని చెప్పారు.

2019 ఎన్నికల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ‘చౌకీదార్ చోర్ హై’ నినాదాన్ని రాహుల్ తీసుకొచ్చారని… ఈ నినాదానికి మద్దతు పలికే నేతలు చేతులు ఎత్తాలని పార్టీ మీటింగ్ లో రాహుల్ అడగారని… అయితే చాలా మంది సీనియర్ నేతలు ఆ నినాదాన్ని వ్యతిరేకించారని ఆజాద్ చెప్పారు. ఆ మీటింగ్ లో తాను, మన్మోహన్ సింగ్, ఏకే ఆంటోనీ, చిదంబరం కూడా ఉన్నామని చెప్పుకొచ్చారు గులాం నబీ ఆజాద్. ఇందిరాగాంధీ నుంచి తాము రాజకీయాలను నేర్చుకున్నామని ఆజాద్ చెప్పారు.

రాహుల్ పై తనకు ఎలాంటి పగ లేదని ఆజాద్ చెప్పారు. రాహుల్ ఒక మంచి వ్యక్తి, జంటిల్మన్ అని ప్రశంసించారు. తన పట్ల రాహుల్ ఎప్పుడూ విధేయతతోనే ఉన్నారని అన్నారు. అయితే రాజకీయవేత్తగా మాత్రం రాహుల్ అంత అర్హుడు కాదన్నారు. దని చెప్పారు.

తాను బిజెపితో టచ్‌లోఉన్నానన్న వాదనలను కొట్టిపారేసిన గులాం నబీ ఆజాద్, పాత పార్టీలోని నాయకులు ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ (కాంగ్రెస్ ముక్త్ భారత్) ప్రచారానికి సహకరిస్తున్నారని అన్నారు. “నేను ఆ ఎజెండాను నెరవేర్చడం లేదు, నేను బిజెపి ఎజెండాను నెరవేర్చినట్లయితే నేను తొమ్మిదేళ్లపాటు సూచనలు లేదా మార్పులను అభ్యర్థించను.

” అంతర్గత ఎన్నికల పేరుతో కాంగ్రెస్ నాయకత్వం పార్టీకి “పెద్ద మోసం” చేసిందని కూడా ఆజాద్ ఆరోపించారు. గాంధీ’ కుటుంబం పట్ల అయిష్టత పేరుకుపోతున్నా.. సల్మాన్‌ ఖుర్షీద్‌, మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్లు రాహుల్‌నే అధ్యక్షుడిగా కోరుకోవడం దురదృష్టకరమని ఆజాద్‌ వ్యాఖ్యానించారు.

సీనియర్‌, అనుభవజ్ఞులైన నాయకులందరినీ పక్కన పెట్టారని, అనుభవం లేని సైకోఫాంట్ల కొత్త కోటరీ పార్టీ వ్యవహారాలను నడపడం ప్రారంభించిందని ఆయన అన్నారు.

https://www.indiatoday.in/india/video/it-took-me-9-years-to-take-this-decision-ghulam-nabi-azad-on-quitting-congress-1994124-2022-08-29?jwsource=cl

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles