24.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

మణప్పురం గోల్డ్‌లో భారీ దోపిడి… 24 కిలోల బంగారం, రూ.10 లక్షల డబ్బు చోరీ!

రాజస్థాన్‌: ఉదయ్‌పూర్‌లోని మణప్పురం గోల్డ్ లోన్ బ్యాంక్ బ్రాంచ్‌లో సోమవారం ఉదయం సినీఫక్కీలో చోరీ జరిగింది. ఐదుగురు దుండగులు కలిసి 24 కిలోల బంగారం, రూ.10లక్షల నగదు దోచుకెళ్లారు. మొత్తం ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఘటన తర్వాత నగరమంతా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఉదయపూర్‌లోని ప్రతాప్ నగర్‌లోని వాణిజ్య భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ కార్యాలయంలోకి ఉదయం 9.30 నిమిషాల ప్రాంతంలో సెక్యూరిటీ లేని గేటు నుంచి ముసుగులు ధరించిన ఐదుగురు దుండగులు లోపలకి చొరబడ్డారు. దుండగులు వచ్చినప్పుడు మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ కార్యాలయంలో ఐదుగురు ఉద్యోగులు, ఓ ఖాతాదారుడు ఉన్నారు. ఒక్కో దుండగుడు ఒక్కో ప్రదేశానికి వెళ్లి వారి బ్యాగుల్లో తుపాకీలు తీసి అక్కడ పనిచేసే ఉద్యోగులను బెదిరించారు.

మేనేజర్ క్యాబిన్ తో పాటు, బంగారం, నగదు భద్రపరిచే గదిలోకి దుండగులు ప్రవేశించారు. కార్యాలయంలోని ప్రధాన గదిలో ఉన్న వారందరినీ ఒక మూలకు వెళ్లాలని తుపాకీ గురిపెట్టి బెదిరించారు. వెళ్లకపోతే ఉద్యోగులు, కస్టమర్ ను కాల్చివేస్తామని బెదిరించారు. వారి మొబైల్ ఫోన్లు తీసుకుని ల్యాండ్‌లైన్‌ను డిస్‌కనెక్ట్ చేశారు. వీరందరికి ఓ దుండగుడు కాపాల ఉండగా.. మిగిలిన వారంతా స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్లి అక్కడ భద్రపర్చిన తాకట్టుకు వచ్చిన నగలును బ్యాగుల్లో సర్దుకున్నారు. దాదాపు 24 కిలోల బంగారాన్ని దుండగులు పట్టుకుని వెళ్లిపోయారు. మణ్ణప్పురం సిబ్బంది దుండగులతో వాగ్వాదం పెట్టుకోగా పలుమార్లు సిబ్బందిని దుండగులు కొట్టినట్లు పోలీసులకు కార్యాలయం మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అడిషనల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ చంద్రశీల్‌ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles