33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఆర్ఎస్ఎస్ దేశానికి చేసిన నష్టాన్ని పూడ్చేందుకే.. ‘భారత్ జోడో యాత్ర’… రాహుల్ గాంధీ!

కన్యాకుమారి: ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ వల్ల సమాజానికి జరిగిన నష్టాన్ని పూడ్చడంతోపాటు పూర్తిగా విచ్ఛిన్నమైన సమాజంలో ప్రజల మధ్య సంబంధాలను  పునరుద్ధరించడమే లక్ష్యంగా భారత్ జోడో యాత్ర చేపట్టినట్లు రాహుల్ గాంధీ శుక్రవారం చెప్పారు. ఇది “పరివార్ బచావో యాత్ర” అన్న బీజేపీ ఆరోపణకు  సమాధానమిస్తూ… “ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. RSS-BJP తమ సొంత అభిప్రాయం  కలిగి ఉండడాన్ని స్వాగతిస్తున్నాను అని రాహుల్ అన్నారు.

రెండో రోజు యాత్రలో భాగంగా కేరళకు వెళుతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాహుల్.. ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ వల్ల జరిగే నష్టాన్ని గురించి మాట్లాడినప్పుడు… “బీజేపీ వ్యాప్తి చేసిన ద్వేషాన్ని, సమాజంలో వారు సృష్టించిన విభజనలను మనమందరం చూస్తున్నాము. భారీ ధరల పెరుగుదల, నిరుద్యోగం అతిపెద్ద సమస్యలు. CBI, ED వంటి దర్యాప్తు సంస్థలు తన గుప్పిట్లో ఉంచుకుంది. , ఆదాయపు పన్ను శాఖను శత్రువులపైకి ప్రయోగిస్తుంది. ఇద్దరు-ముగ్గురు వ్యాపారవేత్తలు ప్రతిదీ నియంత్రిస్తున్నారు అని రాహుల్ అన్నారు.

ప్రజా సమస్యల్ని తెలుసుకోవడం, వారితో మమేకమవడానికే పాదయాత్ర చేస్తున్నానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. “యాత్రయ్యే పూర్తయ్యే సరికి నాపై తనకి అవగాహన పెరుగుతుంది. తెలివితేటలూ కాస్త పెరుగుతాయి” అని చమత్కరించారు. ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్‌కు ఎంతో కొంత లబ్ధి చేకూరితే మంచిదేనన్నారు. దేశంలో వ్యవస్థలన్నింటినీ బీజేపీ నాశనం చేస్తోందన్నారు. RSS-BJP భారతదేశానికి చేసిన నష్టాలను తొలగించే ప్రయత్నమే ఈ యాత్ర అని రాహుల్ అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ రాజ్‌పథ్‌ను కర్తవ్య మార్గంగా మార్చడంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాహుల్ ఇలా అన్నారు: “సెంటిమెంట్ ఉంటే వారు పేరు మార్చవచ్చు. కానీ  భవిష్యత్తుపై బీజేపీకి దార్శనికత కొరవడిందని స్పష్టం చేశారు.

దేశంలో ప్రతిపక్షాల ఐక్యతకు పాదయాత్ర ఉపకరిస్తుందని రాహుల్ గాంధీ మీడియాతో చెప్పారు. ఒకే తాటిపైకి రావడం విపక్షాల బాధ్యతన్నారు. “కాంగ్రెస్తో పాటు ఇందులో ప్రతి పార్టీకి ఇందులో పాత్ర ఉంది. విపక్షాల ఐక్యతపై చర్చలు సాగుతున్నాయి. కొందరు నాయకులు బీజేపీ ఒత్తిళ్లకు లొంగిపోయి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. దర్యాప్తు సంస్థలకు భయపడి బీజేపీకి దాసోహమంటున్నారు. పాత్రికేయులు సైతం ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు అని రాహుల్ గాంధీ విలేకర్ల ప్రశ్నలకు జవాబిచ్చారు.

సిబిఐ, ఈడిని ఉపయోగించి ఈ ప్రభుత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో మీకు తెలుసు.… చాలా మంది ప్రజలు పోరాడాలని అనుకోరు… కహాన్ ఫస్నా హై. అందుకే బీజేపీతో సఖ్యతగా ఉన్నారు. అది నా వల్ల కాదు. అది నా పాత్ర కాదు. నేను భారతదేశం యొక్క ఆలోచన కోసం పోరాడతాను అని రాహుల్ అన్నారు.

భారతదేశ  సంస్కృతిపై దాడి చేయడమే తాను ప్రధానంగా ఆందోళన చెందుతున్నానని  అని రాహుల్ అన్నారు. యాత్ర మొదటి రోజు ఒక అమ్మాయితో జరిగిన సంభాషణను గుర్తుచేసుకుంటూ రాహుల్ ఇలా అన్నాడు: “ఆమె నన్ను ఇలా అడిగింది, భారత్ జోడో ఎందుకు? నేను ఆమెను భారత్ అంటే ఏమిటి అని అడిగాను. భారత్ సామరస్యంగా జీవించే దేశమని ఆమె అన్నారు. కాబట్టి, సామరస్యం లేకపోతే అది భారత్‌నా? అంటూ రాహుల్ ముగించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపడతారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు “నేను నా నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయంలో నాకు ఎలాంటి గందరగోళం లేదు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడే నేను అధ్యక్షుడిని అవుతానా లేదా మీకు తెలుస్తుంది. అంతవరకు ఓపిక పట్టండీ. ఒకవేళ నేను పోటీలో లేకపోతే అప్పుడు మీ ప్రశ్నలన్నింటికీ జవాబు చెబుతాను” అని రాహుల్ బదులిచ్చారు.

పార్టీ పగ్గాలు చేపట్టడానికి నిరాకరించడం, యాత్రకు నాయకత్వం వహించడానికి ఆయన సుముఖత వ్యక్తం చేయడం మధ్య వైరుధ్యం గురించి అడిగిన ప్రశ్నకు, “నేను యాత్రకు నాయకత్వం వహించడం లేదు, నేను కేవలం యాత్రలో మాత్రమే పాల్గొంటున్నాను”అని రాహుల్ బదులిచ్చారు.

పార్టీ చీఫ్‌గా తిరిగి రావాలనే ఆలోచనకు రాహుల్ స్పష్టంగా వ్యతిరేకం, అయితే రాహుల్‌పై అగ్ర నాయకత్వం, కింది స్థాయి కార్యకర్తలు ఒక రకమైన ఒత్తిడిని పెంచాలని నిశ్చయించుకున్నారు. ఆయన యాత్రలో ప్రజల మధ్య ఉండడాన్ని ఆస్వాదిస్తున్నారని, రాజకీయాలంటే ప్రజలను పాలించే బదులు ప్రజలను అర్థం చేసుకోవడం, వారి సమస్యలను పరిష్కరించడం అని నమ్ముతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles