23.7 C
Hyderabad
Monday, September 30, 2024

‘దేశాన్ని ఐక్యం చేసే ఈ యాత్ర ఆగదు’… రాహుల్ గాంధీ!

తిరువనంతపురం: దేశంలో మతోన్మాదం, విభజన రాజకీయాలు, ద్రోవ్యోల్పణ, నిరుద్యోగ సమస్యలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయాలన్న లక్ష్యంతోనే భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది.  మతం, వర్గాలకు అతీతంగా భారతీయులను ఏకతాటిపైకి తీసుకురావడమే భారత్ జోడో యాత్ర స్ఫూర్తి అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం అన్నారు. మనం కలిసికట్టుగా నిలబడి  ఒకరి పట్ల మరొకరు గౌరవంగా ఉంటే విజయం సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర మంగళవారంతో ఏడో రోజుకు చేరుకుంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్టీ నేతలు నిన్న కనియాపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర కేరళలో 17రోజులపాటు కొనసాగనుంది.  మంగళవారం కేరళలో భారత్ జోడో యాత్రలో కల్లంబలంలో భారీ జనసమూహాన్ని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు.

“హిందూత్వంలో మనం మొట్టమొదటగా నేర్చుకునేది ‘ఓం శాంతి’ అనే రెండు పదాలే. అలాంటి శాంతియుత భారతావనిలో బీజేపీ అశాంతిని విస్తరింపజేస్తోంది. అశాంతిని పెంచే ఈ పార్టీ ఎలా హిందూత్వానికి ప్రతినిధిగా చలామణి అవుతుంది? రాజకీయంగా విద్వేషం రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలవవచ్చని బీజేపీ నిరూపించింది’ అని దుయ్య బట్టారు. భారత్ జోడో యాత్రలో కదం తొక్కుతున్న తమ యాత్రకు పాదాలకు గాయాలు, బొబ్బలు ఆటంకం కాలేవని రాహుల్ అన్నారు.

మంగళవారం జడివానలోనూ యాత్ర కొనసాగింది. వందలాది మంది మద్దతుదారులు రాహుల్తో కలిసి ముందుకు కదిలారు. ‘దేశాన్ని ఐక్యం చేసే ఈ యాత్ర ఆగదు’ అని వీడియోను రాహుల్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ‘భారత స్వప్నాన్ని ముక్కలుచేశారు. దాన్ని మేం ఒక్కటి చేస్తాం. ఆ ప్రయత్నంలో 100 కి.మీ. పూర్తయింది. ఇప్పుడే మేం మొదలుపెట్టాం’ అంటూ ట్వీట్ చేశారు.

కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్ల పాదయాత్ర 150 రోజుల్లో పూర్తవుతుంది. ఈ పాదయాత్ర 12 రాష్ట్రాల గుండా వెళుతుంది. కేరళ నుండి, యాత్ర తదుపరి 16 రోజుల పాటు సాగాక, సెప్టెంబర్ 30న కర్నాటకకు చేరుకుంటుంది. ఈ పాదయాత్ర కర్ణాటకలో 21 రోజుల పాటు సాగనుంది. ఈ యాత్ర ప్రతిరోజూ 25 కి.మీ. పాటు జరుగుతుంది.

ఇదిలా ఉంటె యాత్రలో సరికొత్త వివాదం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్ అకౌంట్ ద్వారా చేసిన పోస్ట్‌పై తాజాగా రగడ మొదలైంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిక్కరును తగులబెడుతున్న ఫొటోపై మరో 145 రోజులు మాత్రమే భారత్ జోడో యాత్ర ఉందనే క్యాప్షన్ రాసి ఉంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేసిన విద్వేషం నుంచి దేశాన్ని కాపాడతామని, ఒక్కొక్క అడుగు వేస్తూ లక్ష్యాన్ని చేరుకుంటామని ట్విట్‌కు మ్యాటర్ జత చేశారు.

ఆర్ఎస్ఎస్ నిక్కరు తగులబెడుతున్న ఫొటోపై భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షుడు తేజస్వీ సూర్య మాట్లాడుతూ దేశంలో తమ రాజకీయ అదృష్టాన్ని కాంగ్రెస్ గతంలో రాజుకున్న నిప్పును చిత్రీకరిస్తోందన్నారు.

1984లో ఢిల్లీ సిక్కు అల్లర్లు, 2002లో కరసేవకులను సజీవ దహనం చేసిన గోద్రా ఘటనతో సహా గతంలో జరిగిన వివిధ హింసాత్మక సంఘటనలను సూర్య వరుస ట్వీట్‌లు చేశారు.

వివాదాస్పద క్యాథలిక్ పూజారి జార్జ్ పొన్నయ్యను కలిసినందుకు రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో దాడి చేసిన కేంద్ర మంత్రి అజయ్ భట్, భారతదేశాన్ని విభజించాలనుకునే వ్యక్తులకు మద్దతు ఇస్తున్నారని, ఆర్టికల్ 370 రద్దుతో సహా ప్రధాని మోదీ ప్రతి నిర్ణయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని అన్నారు.

“మేము భారత్ జోడో యాత్రను ఇప్పుడే ప్రారంభించాము, అయితే దానికి లభిస్తున్న అపూర్వమైన స్పందనపై బిజెపి నిజంగా ఆందోళన చెందుతోంది. దాని నాయకుల ప్రతిచర్యల నుండి మనం దానిని అంచనా వేయవచ్చు. ప్రధాని మోదీలా తన దుస్తులకు ప్రజాధనాన్ని ఖర్చు చేయడం లేదని జైరాం రమేష్ అన్నారు.

కాంగ్రెస్ ప్రకారం, బిజెపి నేతృత్వంలోని కేంద్రం యొక్క విభజన రాజకీయాలను ఎదుర్కోవడానికి, ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు,  రాజకీయ కేంద్రీకరణ యొక్క ప్రమాదాల నుండి దేశ ప్రజలను మేల్కొల్పడానికి ‘భారత్ జోడో యాత్ర’ జరుగుతోందని ఆయన గుర్తు చేశారు.

ఈ పాదయాత్రలో, ర్యాలీలు, బహిరంగ సభలు ఉన్నాయి, వీటిలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సహా సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరవుతారని జైరాం రమేష్ మీడియాకు తెలిపారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాటు పార్టీ ఎంపీలు, నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి ఉండడం గమనార్హం.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles