33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

కదులుతున్న రైలులో సెల్ ఫోన్ చోరీకి యత్నం… నరకం చూసిన దొంగ!

పాట్నా: కదులుతున్న రైలులో ఓ ప్రయాణికుడి మొబైల్‌ ఫోన్‌ కొట్టేయాలనుకున్న దొంగకు చుక్కలు కనిపించాయి. ఈ ఘటన అతనికి ఓ పీడకలను తలపించింది.  రైలు కిటికీ నుంచి మొబైల్ ఫోన్ చోరీకి చేసిన  ప్రయత్నం విఫలమయింది.

బీహార్‌లోని ఖగారియాలో ఈ సంఘటన సెప్టెంబర్ జరగ్గా, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. బెగుసరాయ్ నుంచి ఖగారియాకు వెళ్తున్న రైలులో కిటికీలోంచి ప్రయాణికుడి మొబైల్ను కొట్టేసేందుకు ఓ దొంగ ప్రయత్నించాడు. రైలు సాహెబూర్ కమల్ స్టేషన్ దగ్గరకు రాగానే దొంగ మొబైల్ దొంగిలించేందుకు వ్యక్తి చేతిని పట్టుకున్నాడు. కానీ అక్కడే అతని ప్లాన్ బెడిసి కొట్టింది. మొబైల్ తీసుకుంటుండగా అప్రమత్తమైన ప్యాసింజర్ దొంగ చేతులను కిటికీలోంచే గట్టిగా పట్టుకున్నాడు.

రైలు వేగమందుకోవడంతో దొంగ క్షమాపణలు కోరుతూ, చేతులు వదిలేయమని వేడుకున్నాడు. ఏం చేయాలో తోచని దొంగ తన రెండో చేతిని కూడా కిటికీ ద్వారా లోపలికి అందించాడు. ప్రయాణికుడు దొంగ రెండు చేతులను గట్టిగా పట్టుకున్నాడు. దాదాపు 10 కిలోమీటర్లు దొంగ అలాగే కిటికీకి వేలాడుతూ ప్రయాణం చేశాడు. చివరికి రైలు ఖగారియా దగ్గరకు రాగానే ప్రయాణికుడు దొంగ చేయి వదలడంతో అతడు పారిపోయాడు. దీనిని తోటి ప్రయాణికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

ఈ దొంగ  తప్పించుకున్నప్పటికీ…ఇలాంటి ఘటన ఒకటి జూన్‌లో జరిగింది. దొంగ  విజయవంతమయ్యాడు – ఇంటర్నెట్‌లో కొందరు అతన్ని “కొత్త స్పైడర్ మాన్” అని పిలిచారు. బీహార్‌లోని రైలు లోపల నుండి చిత్రీకరించిన ఆ వీడియో, వంతెనపై కూర్చున్న పిక్‌పాకెట్ కిటికీలోంచి ప్రయాణికుడి వాలెట్‌ను లాక్కుంటున్నట్లు చూపించింది.

జూన్‌లో కూడా ఇదే విధమైన స్నాచింగ్ ప్రయత్నం బీహార్‌లోని కతిహార్ రైల్వే స్టేషన్ సమీపంలో కదులుతున్న రైలు నుండి బయటకు తీయబడిన ఒక మహిళా పోలీసుకు తీవ్ర గాయాలయ్యాయి.

https://www.ndtv.com/video/news/news/mobile-phone-thief-stuck-in-fast-moving-train-window-after-woman-grabs-him-654483

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles