28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

దుర్గాదేవి విగ్రహాల నిమజ్జనంలో అపశ్రుతి… పశ్చిమ బెంగాల్‌లో 8 మంది మృతి!

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి జిల్లాలో దుర్గా దేవి విగ్రహాల నిమజ్జనంలో  విషాదం చోటుచేసుకుంది. 8 మంది చనిపోయారు. జల్‌పాయ్‌గురి నగర సమీపంలోని మాల్ నది మధ్యలో ఉన్న ఓ చిన్న దీవి లాంటి ప్రదేశంలో నిల్చుని.. విగ్రహాలు నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా వరద వచ్చింది. దీనితో నది తీరంలో నిమజ్జనంలో పాల్గొన్న పలువురు భక్తులు అకస్మాత్తుగా వచ్చిన వరదకు కొట్టుకుపోయారు. అప్రమత్తమైన ఎన్టీఆర్ఎఫ్ అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

దాదాపు ఏడుగురి మృతదేహాలను వెలికితీశామని, గాయపడిన 15 మందికి చికిత్స అందిస్తున్నామని జల్పాయ్ గురి జిల్లా మెజిస్ట్రేట్ మౌమిత గోదరా బసు తెలిపారు. నదీ తీరంలో ఉన్న 60 మందిని వరదల బారి నుంచి కాపాడమని ఆమె వెల్లడించారు. భారీవర్షాల వల్ల మాల్ నదిలోకి ఒక్కసారిగా వరద ప్రవాహం రావడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని చెప్తున్నారు.

“ఘటన జరిగినప్పుడు బెంగాల్ వెనుకబడిన తరగతుల సంక్షేమ మంత్రి బులు చిక్ బరైక్ సంఘటనా స్థలంలో ఉన్నారు. ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మంత్రి మాట్లాడుతూ… చాలా మంది ప్రజలు నా కళ్లముందే కొట్టుకుపోయారు. నీటి ప్రవాహం చాలా బలంగా ఉంది. సంఘటన జరిగినప్పుడు వందలాది మంది ప్రజలు ఉన్నారు. ఇంకా చాలా మంది తప్పిపోయారు,” అని అతను చెప్పాడు. మిస్టర్ బరాక్,  సీనియర్ తృణమూల్ నాయకులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు.

ట్విట్టర్‌లో ప్రమాద దృశ్యాలు

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles