33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

మందుల తనిఖీకి ట్యాబ్లెట్ స్ట్రిప్స్ పై QR కోడ్… కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన!

న్యూఢిల్లీ:  ‘ఇందుగలదందులేదు’ అన్నట్లుగా.. అన్నింట్లోనూ కల్తీ రాజ్యమేలుతోంది. అనారోగ్యానికి గురైనప్పుడు వేసుకునే మందులు సైతం నకిలీ మయం కావడం ఆందోళన కలిగించే విషయం. ఫేక్ మందుల తయారీ బిజినెస్ చాప కింద నీరులా విస్తరించిన ప్రస్తుత పరిస్థితుల్లో అసలు మందులేవో, నకిలీ మందులేవో గుర్తించడం సవాల్‌గా మారింది. దీంతో.. ప్రజలను నకిలీ మందుల బారి నుంచి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది.

మెడికల్ షాపుల్లో నకిలీ మందులను గుర్తించేందుకు ట్యాబ్లెట్ స్ట్రిప్స్ పై క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విధానం వల్ల వినియోగదారులు సులభంగా నకిలీ మందులేవో, అసలు మందులేవో గుర్తించవచ్చు.

ట్యాబ్లెట్ స్ట్రిప్స్ పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా వినియోగదారులు అవి అసలైనవా, నకిలీవా గుర్తించేందుకు వీలు అవుతుందని కేంద్రం తెలిపింది. ఔషధాలు ప్యాక్‌చేసే బాటిల్స్‌, జార్‌, ట్యూబ్‌, స్ట్రిప్‌లపై ఈ క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించాల్సి ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్‌లను తొలుత ప్రజలు విరివిగా ఉపయోగించే 300 ఔషధాలపై ముద్రించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.100 కంటే ఎక్కువ విలువైన ఔషధాలపై క్యూఆర్‌ కోడ్‌ ముద్రించి..ఆపై మిగిలిన మందులకూ విస్తరించాలని కేంద్రం యోచిస్తోంది.

బార్‌కోడ్స్ లేదా క్యూఆర్ కోడ్స్‌ను  ఆ మందుల ప్రైమరీ ప్యాకేజింగ్ లేబుల్స్‌పై ఉంచనున్నారు. ఈ దశలో యాంటీబయాటిక్స్,  కార్డియాక్(Cardiac), పెయిన్ రిలీఫ్ పిల్స్(Pain-relief Pills), యాంటీ అలర్జిక్ మెడిసిన్స్‌పై (Anti-allergic Medicines).. అవి కూడా 100 రూపాయల కంటే ఎక్కువ ఖరీదు చేసే స్ట్రిప్స్‌పై ఈ క్యూఆర్ కోడ్ ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానంలో భాగంగా నకిలీ మందులను, అసలు మందులను వినియోగదారుడు ఎలా నిర్ధారించవచ్చో తెలుసుకుందాం..
* వినియోగదారుడు మెడికల్ షాప్‌కు వెళ్లి ఈ 300 రకాల మందుల్లో ఏ ఒక్కటి కొనుగోలు చేసినా ఆ స్ట్రిప్‌పై లేదా బాటిల్‌పై క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది.
* ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌కు వెళుతుంది. ఆ డ్రగ్‌కు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది. ఐడెంటిఫికేషన్ కోడ్, ఆ డ్రగ్ జెనరిక్ పేరు, బ్రాండ్ పేరు, మ్యాన్యుఫ్యాక్చరర్ పేరు, అడ్రస్.. బ్యాచ్ నంబర్, ఆ మందు తయారైన తేదీ.. ఎక్స్‌పైరీ డేట్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ లైసెన్స్ నంబర్ కనిపిస్తాయి.
* Unique ID codeను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పేస్ట్ చేసి మొబైల్ ఫోన్ ద్వారా వినియోగదారుడు ట్రాక్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది.
* మొదటి విడతలో 300 Top Selling Medicines పై ఈ బార్‌కోడ్స్‌ను ప్రైమరీ ప్యాకేజింగ్‌లో ప్రింట్ చేయనున్నారు.
* ఈ విధానంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నప్పటికీ అమల్లోకి రావడానికి కొన్ని వారాల సమయం పట్టొచ్చని తెలుస్తుంది. అంతేకాదు.. మెడిసిన్స్ ధరలు కూడా 3 నుంచి 4 శాతం వరకూ పెరిగే అవకాశం కూడా ఉంది.
* కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ డేటాబేస్ ఏజెన్సీని ఏర్పాటు చేసి సింగిల్ బార్‌కోడ్‌తో వినియోగదారుడు అది ఫేక్ మెడిసినో లేదా ఒరిజినల్ మెడిసినో తెలుసుకునేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles