28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

హిజాబ్ కేసు సీజేఐకి సిఫారసు… సుప్రీంలో అనూహ్య పరిణామం!

న్యూఢిల్లీ: కర్ణాటక హిజాబ్​ వివాదంపై సుప్రీంకోర్టు ఎటూ తేల్చలేదు. ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పులు ఇచ్చారు. కర్ణాటక హైకోర్టు తీర్పును జస్టిన్ హేమంత్ గుప్తా సమర్ధించారు. ఈ వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైన 26 అపీళ్లన్నింటినీ కొట్టివేయాలని ప్రతిపాదించారు. జస్టిస్ సుధాన్లు దులియా హిజాబ్‌కి అనుకూలంగా తన వాదనల్ని వినిపించారు.. కర్ణాటక హైకోర్టు తీర్పును పక్కనబెడుతూ.. హిజాబ్ బ్యాన్​పై అపీళ్లను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘హిజాబ్‌ అనేది వారి ఎంపికకు సంబంధించినది. కానీ దీనికంటే ఉన్నతమైనది ఆడపిల్లల చదువు అని నా అభిప్రాయం అన్నారు.

దీంతో సరైన దిశానిర్దేశం కోసం ఈ పిటిషన్లను సీజేఐకి సిఫారసు చేస్తున్నట్లు జస్టిస్ హేమంత్ గుప్తా తెలిపారు. ఈ కేసు మరో బెంచ్ లేదంటే రాజ్యాంగ ధర్మాసనం ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సుమారు  పదిరోజుల పాటు హిజాబ్ ద్విసభ్య న్యాయమూర్తుల ధర్మాసనం వాదనలు వింది. సెప్టెంబర్ 22న తీర్పును రిజర్వ్ చేసింది.  పిటిషనర్ల తరఫు 21 మంది  సీనియర్ న్యాయవాదులు డా.రాజీవ్ ధావన్, కపిల్ సిబల్, దుష్యంత్ దవే, హుజేఫా అహ్మదీ, సంజయ్ హెగ్డే, సల్మాన్ ఖుర్షీద్, దేవదత్ కామత్, యూసుఫ్ ముచ్చాల, ఏఎం ధర్, ఆదిత్య సోంధీ, జయనా కొఠారి, కొలిన్ గోన్సాల్వేస్, న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్ తదితరులు వాదనలు వినిపించారు.

ముస్లిం బాలికలు హిజాబ్ లేకుండా పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారని.. దీంతో వారి చదువులకు ఆటంకం ఏర్పడుతుందని.. చాలా మంది పాఠశాలకు వెళ్లడమే మానేశారని సుప్రీంకోర్టుకు విన్నవించారు.

ప్రతివాదుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్, కర్ణాటక అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవాద్గీ వాదించారు. సీనియర్ న్యాయవాదులు ఆర్ వెంకటరమణి, దామా శేషాద్రి నాయుడు, వి మోహన వాదనలు వినిపించారు.

పాఠశాలలో, కళాశాల్లలో సమానత్వం, సమగ్రతకు భంగం కలిగించే దుస్తులను నిషేధిస్తూ కర్ణాటక రాష్ట్రప్రభుత్వం ఫిబ్రవరి 5 నాటి ఉత్తర్వుల్లోని అంశాలను  ప్రభుత్వం తరుపున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వివరించారు.

విచారణ సందర్భంగా తలెత్తిన కొన్ని అంశాలు:

  • శబరిమ పెండింగ్‌లో ఉన్న దృష్ట్యా ఈ అంశాన్ని పెద్ద బెంచ్‌కు రిఫర్ చేయాలా.?
  • ఇస్లాంలో హిజాబ్ ఒక ముఖ్యమైన మతాచారం కాదా?
  • ఆర్టికల్ 25 ప్రకారం కోసం హిజాబ్ ఒక ముఖ్యమైన మతపరమైన ఆచారం అని నిర్ధారించడం అవసరమా?
  • ఆర్టికల్ 19(1)(a) ప్రకారం హిజాబ్ ధరించే హక్కు భావప్రకటనా స్వేచ్ఛలో భాగంగా… గోప్యత, గౌరవ హక్కులో భాగంగా క్లెయిమ్ చేయవచ్చా?
  • ఆర్టికల్ 19(2) ప్రకారం సహేతుకమైన పరిమితుల ఆధారంగా ఫిబ్రవరి 5 ప్రభుత్వ ఉత్తర్వును సమర్థించవచ్చా?
  • కొన్ని ఇతర వర్గాలు కాషాయ వస్త్రాలు ధరించి నిరసనలు చేయడం ప్రారంభించిన కారణంగా హిజాబ్‌ను నిషేధించవచ్చా?
  • ముస్లిం బాలికలకు విద్యను దూరం చేసే పరిమితి విధించడంలో చట్టబద్ధమైన రాష్ట్ర ప్రయోజనం ఏమైనా ఉందా?
  • విద్యార్థులందరికీ యూనిఫాం సూచించబడిన తరగతి గదిలో మతపరమైన దుస్తులు ధరించడానికి ఏదైనా ప్రాథమిక హక్కు ఉందా?
  • ఒక విద్యా సంస్థలో యూనిఫాం యొక్క ప్రిస్క్రిప్షన్ అసమంజసమైన పరిమితిలో ఉంచబడుతుందా?
  • వాదనల సందర్భంగా, ముస్లిం బాలికలు విద్యార్థులు హిజాబ్ ధరించే సంప్రదాయం లేదని, నిరసనలు జరుగుతున్నాయని రాష్ట్రం కోర్టుకు తెలిపింది.

నేపథ్యం

మార్చి 15న కర్ణాటకలోని ఉడుపిలోని ప్రభుత్వం ప్రీ యూనివర్సిటీ గర్ల్స్ కాలేజీకి చెందిన ముస్లిం విద్యార్థలు తరగతి గదులలో హిజాబ్ ధరించడానికి అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్​ను కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. ఈ హిజాబ్ వివాదం ఉడుపి నుంచి కర్ణాటకలోని చిక్ మంగళూర్, మాండ్యా, బాగల్ కోట్, దక్షిణ కన్నడ జిల్లా, బెంగళూర్, తుముకూరు, చిక్ బల్లాపూర్, శివమొగ్గ జిల్లాలకు కూడా వ్యాపించింది.

 

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles