31 C
Hyderabad
Tuesday, October 1, 2024

కాంగ్రెస్‌ అధ్యక్షునిగా మల్లికార్జున ఖర్గే ఎన్నిక!

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ నూతన అధ్యక్షునిగా మల్లికార్జున ఖర్గే భారీ మెజారిటీతో గెలిచారు.  ఖర్గేకు 7897 ఓట్లు రాగా, శశిథరూర్‌కు 1072 ఓట్లు వచ్చాయి. దాదాపు రెండు దశాబ్దాల తరవాత గాంధీ కుటుంబేతర వ్యక్తి పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపడుతున్నారు. ఫలితాలు వచ్చిన వెంటనే ఖర్గేకు శశిథరూర్ అభినందనలు తెలిపారు.‌

భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఉండటం గొప్ప గౌరవం.. పెద్ద బాధ్యత.. ఆ బాధ్యతను సక్రమంగా ఖర్గే నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను.. వెయ్యి మందికిపైగా సభ్యుల మద్దతును పొందడం.. భారత అంతటా అనేక మంది కాంగ్రెస్ శ్రేయోభిలాషుల ఆశలు, ఆకాంక్షలకు అద్దం పడుతోంది’’ అని ట్వీట్ చేశారు.

ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీ నుంచి ఖర్గే అధ్యక్ష బాధ్యతలను స్వీకరించబోతున్నారు.

కాగా, ఖర్గే వయసు 80 ఏళ్లు. కర్ణాటకలోని బీదర్ జిల్లా భల్కి తాలూకా వరావట్టి గ్రామంలో (అప్పట్లో నిజాం సంస్థానం) 1942లో ఆయన జన్మించారు. ఆయనకు భార్య రాధా బాయి, ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఖర్గే బౌద్ధ మతాన్ని అనుసరిస్తారు.

మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ సీనియర్ నేత., 16వ లోక్ సభలో ఎంపీ. కర్ణాటకలోని గుల్బర్గా నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పార్లమెంటుకు ఎన్నికయ్యారు. రైల్వే మంత్రిగా కూడా ఆయన సేవలను అందించారు. ప్రస్తుతం లోక్‌సభలో  కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఖర్గే కొనసాగుతున్నారు. రికార్డు స్థాయిలో పది సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తొమ్మిది సార్లు గెలుపొందారు. ఇటీవల ఎన్నికల్లో గుల్బార్గా నుంచి పోటీ చేశారు. కర్ణాటక రాష్ట్రం నుంచి షెడ్యూల్ కులానికి చెందిన ఎంపీగా కొనసాగుతున్నారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles