33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల!

ఢిల్లీ: గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నేడు విడుదల చేసింది.  సీఈసీ రాజీవ్ కుమార్ ఎన్నికలకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. మొత్తం రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబరు 1న తొలిదశ ఎన్నికలు, డిసెంబరు 5న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో 89 నియోజకవర్గాల్లో, రెండో విడతలో 93 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబరు 8న ఓట్లను లెక్కించి.. ఫలితాలను ప్రకటిస్తారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కూడా అదే రోజు విడుదలవుతాయి.

గుజరాత్‌లో మొత్తం 4 కోట్ల 90 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2.53 కోట్లు కాగా.. మహిళలు 2.37 కోట్ల మంది ఉన్నారు. ట్రాన్స్ జెంటర్లు 1417 మంది ఉన్నారు. మొత్తం 51,782 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది.

గుజరాత్ అసెంబ్లీలో 142 జనరల్ స్థానాలు ఉండగా.. 13 ఎస్సీ, 27 ఎస్టీ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత 25 ఏళ్లుగా గుజరాత్ లో బీజేపీ తిరుగలేని అధికారాన్ని చెలాయిస్తోంది. ఈ సారైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తాను రేసులో ఉన్నానని చెబుతోంది.

గుజరాత్ ఎన్నికల షెడ్యూల్:

  • నోటిఫికేషన్-నవంబర్ 5 (తొలి విడత) నవంబర్ 10 (రెండో విడత
  • నామినేషన్ ప్రారంభం- నవంబర్ 14 (తొలి విడత), నవంబర్ 17 (రెండో విడత
  • నామినేషన్ల పరిశీలన- నవంబర్ 15, 18
  • నామినేషన్ల ఉపసంహరణ- నవంబర్ 17, 21
  • తొలి విడత పోలింగ్ – డిసెంబర్ 1
  • రెండో విడత పోలింగ్ – డిసెంబర్ 5
  • ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8

 

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles