28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఈశాన్య రాష్ట్రాల్లో మోగిన అసెంబ్లీ ఎన్నికల నగారా!

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగుతాయి.  ఎన్నికల ఫలితాలు మార్చి 2న విడుదలవుతాయి. ఈ ఎన్నికలు అన్ని రాష్ట్రాల్లో ఒకే దశలో జరుగుతాయి.

ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే మార్చిలో పూర్తవుతుంది. ఆలోపు కొత్త ప్రభుత్వం ఎన్నికవుతుంది. త్రిపురలో ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 21న విడుదలవుతుంది. జనవరి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జనవరి 30న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 2 తుది గడువు. మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు సంబంధించి జనవరి 31న నోటిఫికేషన్ వెలువడుతుంది. ఫిబ్రవరి 7 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 8న నామినేషన్లు పరిశీలిస్తారు. కాగా నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఫిబ్రవరి 10.

ప్రస్తుతం త్రిపురలో బీజేపీ అధికారంలో ఉంది. మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) అధికారంలో ఉంది. నాగాలాండ్‌లో నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ) అధికారంలో ఉంది.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్ మాట్లాడుతూ… ‌ఎన్నికల్లో జరిగే అక్రమాలపై సీవిజిల్‌ యాప్‌ ద్వారా ఎన్నికల కమిషన్‌కి తెలియజేయవచ్చునని రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. 9,125 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు, 80 శాతానికి పైగా పోలింగ్‌ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోనేనని తెలిపారు. 70శాతం పోలింగ్‌ స్టేషన్లలో వెబ్‌ కాస్టింగ్‌ సదుపాయం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై 100 నిమిషాల్లోగా స్పందిస్తామని చెప్పారు. ప్రలోభాలు లేకుండా ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలంటే ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles