24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

రిటైర్డ్ న్యాయమూర్తులకు రాజ్యాంగ పదవులు… కాంగ్రెస్ విమర్శ!

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అనుకూలంగా పనిచేసి ఆయనను ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన వారికే గవర్నరు వంటి రాజ్యాంగ పదవులు దక్కుతున్నాయని కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు కొత్తగా ఆరుగురిని గవర్నర్లుగా నియమించడంతో పాటు ఏడుగురు గవర్నర్లను బదిలీ చేయడంపై కాంగ్రెస్‌ నేతలు ఘాటుగా స్పందించారు. ప్రత్యేకించి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను ఆంధ్రప్రదేశ్‌ గవర్నరుగా నియమించడంపై కాంగ్రెస్‌ ఎంపి మాణిక్కం టాగుర్‌ స్పందిస్తూ ‘అదానీ కోసం మోడీ పనిచేస్తారు. మోడీ కోసం పనిచేసినోళ్లు గవర్నర్లు అవుతారు. ఇక ప్రజల కోసం పనిచేసేదెవరు?’ అని ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ కూడా తీవ్రంగా స్పందించారు. గతంలో బిజెపి సీనియర్‌ నేత అరుణ్‌ జైట్లీ చేసిన వ్యాఖ్యలను జైరాం గుర్తు చేస్తూ ట్వీట్‌ చేశారు. ‘రిటైర్‌మెంట్‌ తర్వాత పదవులు ..రిటైర్‌మెంట్‌ కాబోయే ముందు ఇచ్చే తీర్పులు ప్రభావితం అవుతున్నాయి’ అని గతంలో అరుణ్‌ జైట్లీ 2012లో ఒక సందర్భంలో పేర్కొన్నారు. ఇప్పుడు గవర్నర్ల నియామకాల నేపథ్యంలో జైట్లీ చేసిన ఆ వ్యాఖ్యల వీడియోనే జైరాం తిరిగి పోస్టు చేశారు. గడిచిన మూడు, నాలుగేళ్లుగా ఇందుకు కచ్చితమైన సాక్ష్యాలు లభిస్తున్నాయని ఆయన తెలిపారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles