33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

శివసేన పేరు, గుర్తు కొనుగోలుకు రూ.2,000 కోట్ల డీల్… ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపణ!

ముంబయి: శివసేన పేరు, పార్టీ గుర్తును.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గానికి కేటాయిస్తూ ఎన్నికల సంఘం చేసిన ప్రకటనపై ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన పార్టీ పేరు, గుర్తు ‘విల్లు- బాణం’ కోసం రూ.2000 కోట్ల ఒప్పందం జరిగిందని ఆరోపించారు. రూ.2,000 కోట్లు అనేది ప్రాథమిక అంచనా అని.. ఇది 100 శాతం నిజమని సంజయ్​ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదే విషయంపై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. భాజపాపై విమర్శలు గుప్పించారు.

ఎన్నికలు సంఘం ‘విల్లు-బాణం’ గుర్తులను శిందే వర్గానికి కేటాయించడం ఓ ఒప్పందం. ఈ ఒప్పందం విలువ ఎంత ఉండొచ్చని అనుకుంటున్నారు? నాకు అందిన సమాచారం ప్రకారం.. రూ.2,000 కోట్లు. ఎన్నికల గుర్తు, పేరు కోసం ఇంత మొత్తం లావాదేవీ జరిగింది. ఆరు నెలల వ్యవధిలో ఈ లావాదేవీలు పూర్తి చేశారు. ఈ సమాచారం 100 శాతం నిజం. దేశ చరిత్రలో ఇలా ఎన్నడూ జరలేదు. ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.

ఈసీ నిర్ణయం అనంతరం సత్యమేవ జయతే అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపైనా సంజయ్ రౌత్  విమర్శలు చేశారు. సత్యాన్ని, న్యాయాన్ని డబ్బుతో కొనేవారి గురించి మాట్లాడబోనని అన్నారు. “‘సీఎం పదవి కోసం ఉద్ధవ్‌ ఠాక్రే.. కాంగ్రెస్​, ఎన్సీపీల కాళ్లు పట్టుకుంటున్నారు’ అని అమిత్​ షా అన్నారు. మరి ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్‌ శిందే ఏం చేస్తున్నారు? మహారాష్ట్ర ప్రజలు అమిత్​ షా మాటలను పట్టించుకోరు. మహారాష్ట్రలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారనేది ప్రజలే నిర్ణయిస్తారు. గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలను భాజపా పెద్ద ఎత్తున డబ్బు పెట్టి కొనుగోలు చేస్తోంది. ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు, ఎంపీకి రూ.100 కోట్లు, కౌన్సిలర్లకు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఇచ్చారు” అని ఆరోపించారు.

 

కాగా, పుణెలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ” ఎన్నికల సంఘం ‘దూద్ కా దూద్, ఔర్ పానీ కా పానీ’ (నిజం, అబద్ధాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించింది) ‘సత్యమేవ జయతే’ విల్లు, బాణం గుర్తు, పార్టీ పేరు ‘శివసేన’ను  షిండే జీ పొందారని వ్యాఖ్యానించారు.

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి పార్టీ పేరు “శివసేన”  “విల్లు-బాణం” గుర్తును కేటాయించిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా, షిండే (ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి) గత సంవత్సరం థాకరేపై తిరుగుబాటు చేసినప్పటి నుండి శివసేన (ఏక్‌నాథ్ షిండే, ఉద్ధవ్ థాకరే) రెండు వర్గాలు… పార్టీ, గుర్తు కోసం పోరాడుతున్నాయి.

ఈసీ నిర్ణయాన్ని షిండే వర్గం స్వాగతించగా, ఉద్ధవ్ ఠాక్రే వర్గం మాత్రం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది. పోల్ ప్యానెల్ నిర్ణయాన్ని “ప్రజాస్వామ్య హత్య”గా అభివర్ణించిన ఉద్ధవ్ ఠాక్రే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు.

గత నెలలో, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మరియు మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన వర్గాలు పార్టీ పేరు, గుర్తుపై తమకే హక్కు ఉందంటూ… తమ వాదనలకు మద్దతుగా సాక్ష్యాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించాయి.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles