24.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

బీసీ స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్-1 పరీక్షలకు ఉచిత కోచింగ్!

హైదరాబాద్: తెలంగాణ గ్రూప్‌ – 1 పోటీ పరీక్ష రాసే బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు బీసీ స్టడీ సర్కిల్ ప్రకటించింది. దీనికోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా  బీసీ స్టడీ సర్కిల్స్‌గా పేరొందిన తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణా కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది.

మార్చి 29 నుంచి ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) క్యాంపస్‌లోని బీసీ స్టడీ సర్కిల్‌లో 200 మంది అభ్యర్థులకు కోచింగ్ ఇవ్వనున్నారు. ఇంటర్మీడియట్,  డిగ్రీలలో ఫస్ట్-క్లాస్ మార్కులు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

బీసీ స్టడీ సర్కిల్ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. ముందుగా గ్రూప్-I మెయిన్‌కు అర్హత సాధించిన అభ్యర్థులకు కోచింగ్ ప్రోగ్రామ్ ఎంపికలో డిగ్రీ గ్రేడ్‌లకు 50%, ఇంటర్మీడియట్, SSC మార్కులకు 20% వెయిటేజీ ఇస్తామని తెలిపింది.

అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యా, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల ధృవీకరణ నకళ్లతో పాటు ఓయూ క్యాంపస్‌లోని బీసీ స్టడీ సర్కిల్‌లో వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం, 040-24071178 లేదా 040-27077929కి ఫోన్ చేయవచ్చు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles