26.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

పెట్టుబడులకు గమ్యస్థానం… @తెలంగాణ!

హైదరాబాద్: కొత్త రాష్ట్రం తెలంగాణలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలతో పోలిస్తే… 2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ దాదాపు 150 శాతం కొత్త పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. వీటి ద్వారా 60,000 కొత్త ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలను ఏర్పడ్డాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.31,274.56 కోట్ల ప్రతిపాదనలు అందుకోగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రకటించిన పెట్టుబడి ప్రతిపాదనల విలువ రూ.76,568.89 కోట్లుగా లెక్క తేలింది.

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)ల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈపీసీ) గణాంకాలే ఈ విషయాన్ని చెప్తున్నాయి. ‘ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ తెలంగాణ’ అంశంపై ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఓ అధ్యయనం చేసింది. ఈ నివేదికను ఎంఎస్‌ఎంఈ ఈపీసీ చైర్మన్‌ డీఎస్‌ రావత్‌ విడుదల చేశారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆర్గానిక్‌ ఫుడ్‌ ప్రోడక్ట్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ ఏజెన్సీలతో కలిసి ఈ అధ్యయనం నిర్వహించారు.

పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రాంతం తెలంగాణేనని, సుహృద్భావపూరిత వాతావరణం రాష్ట్రంలో ఉందని పెట్టుబడిదారులు విశ్వసిస్తున్నట్టు తాజా నివేదిక చెప్పింది. ఈ నివేదికలో సూక్ష్మ, దాని అనుబంధ పరిశ్రమలు.. రాష్ట్రంలోని సెమీ అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లో విస్తరిస్తున్నట్టు స్పష్టమైంది. 26 లక్షల ఎంఎస్‌ఎంఈల్లో 44 శాతం పట్టణ ప్రాంతాల్లో, 56 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పడుతున్నట్టు అంచనా.

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, దాని అనుబంధ పరిశ్రమలు, ప్రాసెసింగ్‌ పరిశ్రమలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా విధానాన్ని రూపొందించిందని, ఈ విధానంతో వ్యవసాయ అనుబంధ రంగాల్లో స్థానిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నారని నివేదిక తెలియజేసింది. ఈ క్రమంలో టీఎస్‌ ఐపాస్‌పైనా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు రూ.2.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా రాష్టంలో 17.53 లక్షల ఉద్యోగాలు లభించాయి.  ‘కరోనా ప్రభావిత సంవత్సరంలో ఎదురైన సవాళ్లన్నింటిని అధిగమించి తెలంగాణ రాష్ట్ర జీడీపీ 2.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇదే సమయంలో దేశ జీడీపీ 1.4 శాతం క్షీణతను చూసింది. వ్యవసాయ, దాని అనుబంధ రంగాల ప్రగతి తెలంగాణకు కలిసొచ్చింది.

సర్వే ముఖ్యాంశాలు
  • ముఖ్యంగా కృత్రిమ మేధస్సు, బ్లాక్‌చెయిన్, క్లౌడ్ అడాప్షన్, సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్‌లలో పెట్టుబడిదారులకు తెలంగాణ “అత్యంత ఇష్టమైన ప్రాంతం”గా నిలిచింది.
  • ఇది పెట్టుబడి ప్రోత్సాహం మరియు రాష్ట్రం యొక్క విధాన మద్దతు కారణంగా జరిగింది
  • ఐటీ ఎగుమతులు 2014-15లో రూ.66,276 కోట్ల నుంచి 2021-22లో రూ.1,45,522 కోట్లకు రెట్టింపు అయ్యాయి.
  • 2014-15లో ఉపాధి 3.71 లక్షల నుండి 2021-22 నాటికి ఐటీ రంగంలో 7 లక్షలకు పెరిగింది.
  • దాదాపు రెండు లక్షల మంది వైద్య పర్యాటకులు చికిత్స పొందడంతో మెడికల్ టూరిజం ప్రసిద్ధి చెందింది. 2023లో విదేశీ పర్యాటకుల రాక 25 శాతం, 2024 చివరి నాటికి 35 శాతం పెరుగుతుందని అంచనా.
  • సెమీ అర్బన్ మరియు గ్రామీణ రంగాలలో పెద్ద సంఖ్యలో సూక్ష్మ మరియు అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేయబడుతున్నాయి. 2.6 మిలియన్ల MSMEలలో, 56 శాతం గ్రామీణ ప్రాంతాల్లో మరియు 44 శాతం పట్టణ ప్రాంతాల్లో ఉన్నట్లు అంచనా.
  • రాష్ట్ర ప్రభుత్వ విధాన కార్యక్రమాల కారణంగా, స్థానిక పారిశ్రామికవేత్తలచే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్థాపించబడుతున్నాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles