30.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

నగరంలో పుస్తకాల జాతర… ఒకే చోట లక్ష పుస్తకాలు!

హైదరాబాద్: చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు ఏనాడో సెలవిచ్చాడు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా.. పుస్తక పఠనంతో వచ్చే జ్ఞానం శాశ్వతం. అంతటి విజ్ఞానాన్ని అందించే పుస్తకాల జాతరకు హైదరాబాద్‌లోని లకడీకాపూల్ వేదికయింది.

పుస్తక ప్రియుల కోసం తొలిసారిగా నగరంలో యూజ్డ్ బుక్‌ఫ్యాక్టరీ.కామ్ ఆధ్వర్యంలో అపరిమితసంఖ్యలో పుస్తక ప్రదర్శన నిన్న ప్రారంభమైంది.  వివిధ సైజుల పుస్తకాల బాక్సులను తక్కువ ధరలకు పుస్తక ప్రియులు కొనుగోలు చేయవచ్చు. లేదంటే వారికి నచ్చిన పుస్తకాలతో బాక్స్‌లను నింపి కొనొచ్చు. పాఠకులు కొనుగోలు చేసేందుకు వివిధ రకాలైన ఓ లక్ష పుస్తకాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. లక్డీకాపూల్‌లోని మారుతీ గార్డెన్స్‌లో శుక్రవారం ప్రారంభమైన ఈ పుస్తకాల జాతర మార్చి 27న ముగుస్తుంది.

ఇతర బుక్ ఫెయిర్‌లతో పోలిస్తే ఈ పుస్తక ప్రదర్శనకు ప్రత్యేకత ఉంది. ప్రజలు మూడు వేర్వేరు పరిమాణాల బాక్సుల్లో పుస్తకాలను కొనుక్కోవచ్చు. చిన్నవి, మధ్యస్థం,  పెద్దవి వాటి పరిమాణం ప్రకారం ధరలు నిర్ణయిస్తారు. కొనుగోలుదారు పుస్తకాలను వన్-టైమ్ పేమెంట్‌గా కొనాలి. వాటిని తమకు నచ్చిన ఏదైనా పెట్టెలో తీసుకెళ్లవచ్చు. ఆఫర్‌లో ఉన్న వివిధ పుస్తకాలు,  ప్రఖ్యాత రచయితలు… జెఫ్రీ ఆర్చర్, డాన్ బ్రౌన్, ఎనిడ్ బ్లైటన్, షెర్లాక్ హోమ్స్ సిరీస్, పిల్లల పుస్తకాలు, ఆరోగ్యం, ఫిట్‌నెస్, సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు, ఎన్‌సైక్లోపీడియా మరెన్నో పుస్తకాలు ఇక్కడ కొలువుదీరాయి.

ఈ సందర్భంగా Usebooksfactory.com వ్యవస్థాపకుడు తిలక్ దేశింగ్ మాట్లాడుతూ… “నేనుప్రవేశ పరీక్షకు సన్నద్ధమవుతున్నప్పుడు, నాకు అవసరమైన పుస్తకాల కోసం నేను ఎదుర్కొన్న కష్టాలు నాకు గుర్తున్నాయి. నా కష్టాల నుండి ప్రేరణ పొంది, నేను వివిధ రకాల పుస్తకాలు ఒకే చోట లభ్యమయ్యేలా ఓ వేదికను ఏర్పాటు చేసాను.

సోషల్ మీడియా కారణంగా, ప్రజలు పుస్తకాలు చదవడానికి తక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. అందువల్ల ఈ వేదిక ప్రజలు పుస్తకాలను సులభంగా యాక్సెస్ చేయడానికి, వారి పఠన అలవాట్లను పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. మేము ఈ కార్యక్రమాన్ని దక్షిణ-భారత రాష్ట్రాల అంతటా నిర్వహించాము. మంచి రెస్పాన్స్ వచ్చిందని తిలక్ అన్నారు.

ఈ బుక్ ఫెయిర్‌ను యూజ్డ్ బుక్‌ఫ్యాక్టరీ.కామ్ హైదరాబాద్‌లో మొదటిసారి నిర్వహిస్తోంది. మొదటి రోజు పెద్ద సంఖ్యలో వచ్చిన పుస్తక ప్రియుల్ని చూసి ఆశ్చర్యపోయానని తిలక్ అన్నారు. నాన్-ఫిక్షన్, ఫిక్షన్, యువకులు, క్రైమ్, పిల్లల పుస్తకాలతోపాటు మరెన్నో పుస్తకాల ఈ ప్రదర్శనలో ఉన్నాయి.

ఈ సందర్భంగా ఓ పాఠశాల విద్యార్థి మాట్లాడుతూ… “ఈ బుక్ ఫెయిర్ నిజంగా నాకు చాలా సహాయకారిగా ఉంది. నేను తక్కువ బడ్జెట్‌లో విస్తృత శ్రేణి పుస్తకాలను అన్వేషించగలనని అన్నారు.  మరో పుస్తక ప్రేమికుడు మాట్లాడుతూ…  “ఇక్కడ ప్రదర్శించబడిన భారీ పుస్తకాల సేకరణను చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను దాదాపు 17 మధ్య తరహా పుస్తకాలను కొనుగోలు చేసాను” ఆని ఆ కస్టమర్ చెప్పారు.

పేరు తెలిపేందుకు ఇష్టపడని పోలీసు అధికారి మాట్లాడుతూ “నేను రెండు పెద్ద పుస్తకాల పెట్టెలను కొనుగోలు చేసాను, అవి విభిన్న కళా ప్రక్రియలకు సంబంధించినవి.   ఈ పుస్తకాలను పఠన అలవాటును పెంపొందించడం కోసం జైలులోని ఖైదీలకు  విరాళంగా ఇస్తాను”అని అన్నాడు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles