33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఉచిత న్యాయం-కేరాఫ్ న్యాయసేవాధికార సంస్థ

“న్యాయం దృష్టిలో అందరూ సమానులే. న్యాయానికి గొప్ప బీద అన్న తేడా లేదు. అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి ముఖ్యంగా ఏ పౌరుడు ఆర్థిక కారణాల మూలంగా గానీ మరే ఇతర బలహీనత మూలంగా గానీ న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకూడదు” బీద బలహీన వర్గాల వారికి న్యాయ విధానం అందుబాటులోకి తేవడం కోసం, వారికి సామాజిక ఆర్ధిక నేరాలు కల్పించడం కోసం ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని నిశ్చయం.” ఫలితంగా న్యాయ సేవాధికార సంస్థ ఆవిర్భవించింది. పై భావాల ఈ నేపధ్యంలో ఆవిర్భవించిన ఈ సంస్థ 1976 సంవత్సరంలో భారత రాజ్యాంగానికి అధికరణ 390ఏ జతచేసి, బీద బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయం అందించడం, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత గా నిర్దేశించడం ద్వారా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సహాయం అందించడం ప్రారంభమైంది. ఈ క్రమంలో, ఇందుకు ఒక చట్టాన్ని రూపొందించారు. అదేవి న్యాయ సేవ అధికరి కల చట్టము. ఇది కేంద్ర చట్టము. ఈ చట్టం నిర్దేశించినట్లు మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు ఉమ్మడిగా చర్చించి, కొన్ని సూత్రాలను నిరూపొందించారు.

ఉచిత న్యాయానికి అర్హులు.

ఈ చట్టం రూపకల్పన అనంతరం ఉచిత న్యాయానికి ఎవరు అర్హులు? అనే అంశంపై విధి విధానాలను రూపొందించారు. షెడ్యూల్డ్ కులం (ఎస్సీ), లేక తెగ (ఎస్టీ)కు చెందినవారు. మానవ అక్రమ రవాణా బాధితులు, స్త్రీలు, పిల్లలు, మతిస్థిమితం లేని వారు, అవిటి వారు, సామాజిక విపత్తులలో చిక్కుకున్నవారు, భూకంప బాధితులు, పారిశ్రామిక విపత్తుల బాధితులు, పారిశ్రామిక కార్మికులు, హింసకాండ, కుల వైషమ్యాలు, అతివృష్టి, అనావృష్టి బాధితులు ఉచిత న్యాయానికి అర్హులు. వీరితో పాటు ఇమ్మెరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) చట్టము 1956 లో సెక్షన్ 2 (జి) లో తెలిపిన నిర్బంధం, లేక బాల నేరస్తుల న్యాయ చట్టం 1986 సెక్షన్ 2 (జి) లో తెలిపిన మానసిక వైద్యశాల లేక మానసిక చికిత్సాలయం లో తెలిపిన నిర్బంధంలో ఉన్న వ్యక్తులు, వార్షిక ఆదాయం లక్షకు మించని వ్యక్తులు కూడా ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హత కలిగి ఉన్నారు. ఇందులో మరొక్క విషయం గమనించ దగ్గ ది ఏమిటంటే ? వాది, ప్రతివాదులు కూడా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చును.

న్యాయ సహాయ విధానాలు దరఖాస్తు పద్ధతి.

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ లో ఉచిత న్యాయ సహాయం పొందేందుకు గల న్యాయ సహాయ విధానాలు ఈ విధంగా ఉన్నాయి. న్యాయ వాది చే ఉచితంగా న్యాయ సలహా ఇప్పించుట, కేసులను పరిశీలించిన మీదట అవసరమైనచో దరఖాస్తుదా రుని తరపున న్యాయవాదులు నియ మించి ఆయా కోర్టులలో జేసులు చేపట్టుట, న్యాయ సహాయం పొందిన వారికి కోర్టు ఫీజు కేసుకు సంబంధించిన కోర్టు ఖర్చులు భరించుట, న్యాయ సహాయం పొందిన వారికి ఆయా కేసులో జడ్జిమెంట్ ఉచితముగా ఇచ్చుట వంటి సహాయాలు అందించబడతాయి. ఇక దరఖాస్తు చేసుకునే వారు తమ కేసు యొక్క పూర్వ పరాలు, కావాల్సిన పరిష్కారం వివరిస్తూ అఫిడవిట్ను సంబంధిత డాక్యుమెంట్లను జత చేస్తూ దరఖాస్తు చేసుకోవాలి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles