23.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

ప్రధాని, అదానీ కలిసి తెలుగు రాష్ట్రాల సంపద కొల్లగొడుతున్నారు… మంత్రి కేటీఆర్!

హైదరాబాద్: బైలాడిలా గనిలో లభ్యమయ్యే ఐరన్‌ ఓర్‌ని నాసిరకం అని పేర్కొన్న కేంద్రం.. అదానీ గ్రూప్‌ అనుబంధ సంస్థ బిలాదిలా ఐరన్‌ ఓర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఎలా కేటాయించిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు ప్రశ్నించారు. ప్రధాని, అదానీ కలిసి తెలుగు రాష్ట్రాల ప్రజల సంపద కొల్లగొడుతున్న మాట వాస్తవం. ఇది నిర్దిష్టమైన ఆధారాలతో చేస్తున్న ఆరోపణ. నేను చెప్పిన మాట తప్పయితే పరువు నష్టం దావా వేయండి’ అని బీజేపీ నేతలకు మంత్రి సవాల్‌ విసిరారు.

తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. 2018 జూన్‌లో బిలాదిలా కేటాయించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశామన్నారు.  సెప్టెంబర్ 2018లో అదానీ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. గుజరాత్‌లోని ముంద్రాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు.

ఇదే సమయంలో జపాన్ కంపెనీకి, కొరియా కంపెనీకి ఇనుప ఖనిజాన్ని కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మరోవంక పాస్కో కంపెనీతో అదానీ గ్రూప్‌ జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుచేసింది.

ఈ రెండు కలిసి గుజరాత్‌లోని ముంద్రాలో రూ.40 వేల కోట్ల పెట్టుబడితో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు స్వయంగా అదానీయే ప్రకటన చేశారు.

అదానీ గ్రూప్‌కు కేటాయించిన ఛత్తీస్‌గఢ్‌- ఒడిశాలోని బైలాడిలా ఇనుప గనుల లైసెన్సులను వెంటనే రద్దుచేసి, వాటిని బయ్యారం, విశాఖ ఉక్కు పరిశ్రమలకు కేటాయించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్‌ మొదటినుంచీ చెప్తున్నారని కేటీఆర్‌ తెలిపారు. ఇందులో భాగంగానే విశాఖ ఉక్కు పరిశ్రమ వేలం బిడ్‌లో పాల్గొనే అంశంపై అధ్యయనం చేయాలని సూచించారని చెప్పారు.

రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్‌ కుమార్‌, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, దానం నాగేందర్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ టీ భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్సీ టీ రవీందర్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎం శ్రీనివాస్‌రెడ్డి, బండి రమేశ్‌, దాసోజు శ్రవణ్‌కుమార్‌తో కలిసి కేటీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles