26.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

కాంట్రాక్ట్ లెక్చరర్ల పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచాలి!

హైదరాబాద్‌: ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న రెగ్యులర్‌ జూనియర్‌ లెక్చరర్లతో సమానంగా కాంట్రాక్ట్‌ జూనియర్‌ లెక్చరర్ల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్ట్‌ లెక్చరర్ల సంఘం బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి విజ్ఞప్తి చేసింది.

ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తుల చేసిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచింది.

అయితే కమిషనరేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇటీవలే పదవీ విరమణ వయస్తును 58 ఏళ్లకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లలో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని,  దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె. సురేష్ అన్నారు.

కమిషనరేట్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, కాంట్రాక్ట్‌ జూనియర్‌ లెక్చరర్ల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచాలని విద్యాశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.

కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యూలరైజ్ చేసే అంశంపై మాటతప్పిన ప్రభుత్వం పదవీవిరమణ వయస్సును కుదిస్తూ ఉత్తర్వులను జారీ చేయడంపై జూనియర్ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులు అంతా రెగ్యూలర్ ఉద్యోగులుగా గుర్తించబడుతారని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటివరకు క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయలేదు. రెగ్యూలరైజ్ చేయకపోయినా పదవీవిరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచారనే సంతోషంతో ఉన్న జూనియర్ అధ్యాపకులకు ఇంటర్ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ షాక్ ఇస్తూ ఉత్తర్వులను నాలుగు రోజుల కింద జారీ చేశారు.

2023–24 విద్యా సంవత్సరం నుంచి కాంట్రాక్ట్ అధ్యాపకుల పదవి విరమణ వయస్సు 58 ఏళ్లుగా ఇంటర్ విద్యా శాఖ నిర్ణయించింది. కొత్త ఉత్తర్వుల ప్రకారం రెగ్యూలరైజ్ కాకముందే ఒకరిద్దరు కాంట్రాక్ట్ అధ్యాపకులు జిల్లాలో పదవి విరమణ చేయాల్సి వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 78 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేసే యోచనలో ఉన్నప్పుడు పదవి విరమణ వయస్సును కుదించడంలో అర్థం ఏమిటని ప్రభుత్వాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పదవి విరమణ కుదింపు నిర్ణయంను వెనక్కి తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles