23.7 C
Hyderabad
Monday, September 30, 2024

హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు!

హైదరాబాద్: విశ్వనగరం హైదరాబాద్‌ మణిహారంలో మరో కలికితురాయి వచ్చి చేరింది.  నగరవాసులకు డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. రెండు దశాబ్దాల తర్వాత ఆరు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను రోడ్లపైకి స్వాగతించేందుకు నగరం సిద్ధంగా ఉంది.

ట్యాంక్ బండ్, ఓల్డ్ సిటీ,ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌తో సహా ముఖ్యమైన పర్యాటక మార్గాల్లో నడిచే ఈ బస్సులను హైదరాబాద్ మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) రూ. 12.96 కోట్ల భారీ వ్యయంతో కొనుగోలు చేసింది.

బస్సులు బిర్లా మందిర్, అసెంబ్లీ, సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, మక్కా మసీదు  సహా నగరంలోని అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలకు పర్యాటకులను తీసుకువెళతాయి. ప్రారంభంలో, ప్రయాణీకులు ఈ నోస్టాల్జిక్ వాహనాలపై ఉచితంగా ప్రయాణించవచ్చు. తర్వాత ఛార్జీ రూ. 50 ఉంటుంది.

స్పందనను బట్టి రూట్లను విస్తరించాలని అధికారులు యోచిస్తున్నారు. డబుల్ డెక్కర్ బస్సులు ఒకప్పుడు నగర రవాణా వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్నాయి, నిజాంచే ప్రారంభించబడి 2003 వరకు పని చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు  మళ్లీ ఆ జ్ఞాపకాలను, ఆనందాన్ని తీసుకురానుండటం విశేషం.

HMDA తన ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను 30 బస్సులకు విస్తరించాలని యోచిస్తోంది. ఈ బస్సుల్లో డ్రైవర్‌తో పాటు 65 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంది. ఈ బస్సులు పూర్తిగా ఎలక్ట్రిక్‌తో నడుస్తాయి.  ఒక్కసారి ఛార్జింగ్‌తో 150 కిలోమీటర్లు ప్రయాణించగలవు, పూర్తిగా రీఛార్జ్ చేయడానికి కేవలం 2-2.5 గంటల సమయం పడుతుంది.

ఈ బస్సుల కోసం ఖైరతాబాద్ ఎస్టీపీ, సంజీవయ్య పార్కు వద్ద  ప్రత్యేక ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ ట్విటర్ వేదికగా ఎలక్ట్రిక్ బస్సుల వివరాలను వెల్లడించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles