30.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

రాష్ట్ర వ్యాప్తంగా ‘విలేజ్ బస్ ఆఫీసర్’లను నియమించనున్నTSRTC!

హైదరాబాద్: ప్రజా రవాణాను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) వినూత్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

TSRTC ప్రజలను ఆకర్షించడానికి గ్రామాలలో బస్సు అధికారులను నియమించాలని ఆలోచిస్తోంది.  ప్రజల సౌలభ్యం కోసం అమలు చేస్తున్న అనేక ‘TSRTC ప్రవేశపెట్టిన పథకాల’  సమాచారాన్ని ప్రచారం చేయడానికి వారిని ఎంచుకుంది.

“ఈ విలేజ్ బస్ అధికారులు గ్రామస్థులు, గ్రామ పెద్దలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని, అలాగే గ్రామంలో బస్సు సేవలను మెరుగుపరచడానికి అభిప్రాయాన్ని, సూచనలను సేకరించేందుకు పక్షం రోజులకు ఒకసారి సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నామని” టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.

“ఆర్టీసు అధికారుల  సంప్రదింపు సమాచారం గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో ఉంచుతారు. అంతేకాదు లేఖ రూపంలో గ్రామ సర్పంచ్‌కు  స్థానిక బస్సు అధికారి సమాచారం ఇస్తారని” టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ అన్నారు.

గ్రామాల్లో జరిగే వివాహాలు, శుభకార్యాలు, జాతరలపై విలేజ్‌ బస్‌ అధికారులు సమాచారం సేకరిస్తారని, అలాంటి సందర్భాలలో అందుబాటులో ఉండే ఆర్టీసీ సేవలను వివరిస్తారని సజ్జనార్‌ తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉంటే బస్సుల సంఖ్యను పెంచుతారు.

మంచి పనితీరు కనబరిచిన ‘విలేజ్ బస్ ఆఫీసర్’లను గుర్తించి వారికి  రివార్డ్ ఇవ్వాలని కూడా ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం, RTC రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10,000 గ్రామాలకు బస్సు సేవలను అందిస్తుంది. 2,000 గ్రామ బస్ అధికారులను నియమించనుంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles