28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

తెలంగాణ ఇసిబిసి విధానాన్ని ప్రశంసించిన నీతి ఆయోగ్!

హైదరాబాద్: గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలను ప్రోత్సహించడంలో తెలంగాణ ముందంజలో ఉంది. దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన రీతిలో ఇంధన సంరక్షణ నిర్మాణ కోడ్ (ఈసీబీసీ)ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా అవతరించింది. తద్వారా  నీతి ఆయోగ్ నుండి ప్రశంసలు పొందింది.

నీతి ఆయోగ్  సోమవారం విడుదల చేసిన “సామాజిక రంగంలో ఉత్తమ పద్ధతులు: సంగ్రహం, 2023”  నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ECBC విధానంపై ప్రశంసల వర్షం కురిపించింది. ECBC అమలులో తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (REDCO) పాత్రను ఇది ప్రశంసించింది.

మొత్తం రాష్ట్రంలో ECBCని సజావుగా అమలు చేయడంలో ECBC సెల్ ద్వారా పట్టణ స్థానిక సంస్థలకు (ULBs) TSREDCO మద్దతు ఇస్తోందని, ECBC  నిబంధనలను తెలంగాణ మునిసిపాలిటీల చట్టం, 2019లో పొందుపరిచామని నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి రాష్ట్రం తెలంగాణ మరో మైలురాయిని అందుకుంది.

ECBC కింద 13.12 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన 430 వాణిజ్య భవనాలు తెలంగాణలో ECBC కంప్లైంట్‌గా ధృవీకరించినట్లు నివేదిక పేర్కొంది. ECBC ద్వారా సంవత్సరానికి 336 kWh శక్తిని ఆదా చేసినట్లు అంచనా

వాణిజ్య భవనాల కోసం తాజా ECBC సంస్కరణను అమలు చేయడానికి, రాష్ట్రవ్యాప్తంగా నివాస భవనాల కోసం పర్యావరణ-నివాస్ సంహిత కోడ్ (ECBC – R)  స్వీకరణ, అమలు కోసం రాష్ట్ర ప్రణాళికలను కూడా నీతి ఆయోగ్ ప్రస్తావించింది. ECBC  తప్పనిసరి నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి, తెలంగాణ ప్రభుత్వం సంబంధిత ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థల ప్రతినిధులతో కూడిన ECBC సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసిందని నీతి ఆయోగ్ పేర్కొంది. సాంకేతిక కమిటీ థర్డ్-పార్టీ అసెస్సర్ మోడల్‌ను అభివృద్ధి చేసింది, దీని కింద దరఖాస్తుదారు ఎంప్యానెల్డ్ థర్డ్-పార్టీ మదింపుదారుల (TPAలు) నుండి ECBC సమ్మతి సర్టిఫికేట్ పొందవచ్చు. తెలంగాణలో దాదాపు 38 ఈసీబీసీ టీపీఏలను ఎంప్యానెల్ చేసినట్లు నివేదిక పేర్కొంది.

తెలంగాణలో ఆన్‌లైన్ డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (డిపిఎంఎస్) ద్వారా ఇసిబిసి అమలు తప్పనిసరి అని ఆయోగ్ గుర్తించింది. ఈ యంత్రాంగాన్ని మొదట గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క డిపిఎంఎస్‌తో ప్రారంభించి తరువాత అన్ని పట్టణ స్థానిక సంస్థలకు విస్తరించింది. ప్రస్తుతం తెలంగాణలో ఈసీబీసీ నిబంధనలు పాటించకుండా ఎలాంటి వాణిజ్య భవనాల నిర్మాణానికి అనుమతి లేదని నివేదిక పేర్కొంది

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles