24.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

హైదరాబాద్‌లో సెప్టెంబర్‌లోగా మూడు సైకిల్‌ ట్రాక్‌లు ప్రారంభం!

హైదరాబాద్: నాన్-మోటరైజ్డ్ ట్రాన్స్‌పోర్ట్ (ఎన్‌ఎంటీ)ని ప్రోత్సహించే ప్రయత్నాల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ నగరంలోని వివిధ ప్రాంతాల్లో సైకిల్‌ ట్రాక్‌లను ప్రతిపాదించింది. వీటిలో మూడు  సెప్టెంబరు నాటికి ప్రారంభించనున్నారు.  మరో మూడు నవంబర్ నాటికి పూర్తవుతాయి.

సెప్టెంబరు నాటికి అందుబాటులోకి రానున్న మూడు సైక్లింగ్ సౌకర్యాలలో నర్సాపూర్ ఎక్స్ రోడ్లు – బాలానగర్ – వై జంక్షన్- జెఎన్‌టియు – హైదర్‌నగర్ స్ట్రెచ్, ఐడిఎల్ లేక్ -ఎన్‌హెచ్ 65 – జెఎన్‌టియు – మూసాపేట్ మీదుగా నడిచే మరో ట్రాక్ ఉన్నాయి. రెయిన్‌బో విస్టాస్ సమీపంలో, గేటెడ్ కమ్యూనిటీ నివాసం) మూడో ట్రాక్‌ను ఐడీఎల్‌ జంక్షన్‌ నుంచి జేఎన్‌టీయూ జంక్షన్‌ వరకు అభివృద్ధి చేస్తారు.

సైక్లిస్టుల కోసం ప్రతిపాదిత సౌకర్యాలన్నీ కూకట్‌పల్లి మండలంలో ఉన్నాయి. కాగా, సికింద్రాబాద్‌ మండలం తార్నాక నుంచి మెట్టుగూడ మెట్రో స్టేషన్‌ వరకు రోడ్డుకు ఇరువైపులా సైకిల్‌ ట్రాక్‌ను అభివృద్ధి చేయనున్నారు.

నగరం  ఉత్తర, తూర్పు భాగాలలో ఉన్న ఈ ట్రాక్‌లతో పాటు, నగరంలోని పశ్చిమ భాగంలోని GHMC బయో డైవర్సిటీ జంక్షన్ నుండి లెదర్ పార్క్ వరకు ఒక ట్రాక్, రోలింగ్ హిల్స్ నుండి AIG హాస్పిటల్స్ వరకు మరొక ట్రాక్‌ను అభివృద్ధి చేస్తోంది. నవంబరు నాటికి శేరిలింగంపల్లి మండలంలో ఈ రెండు ట్రాక్‌లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

జీహెచ్‌ఎంసీతో పాటు ఖాజాగూడ క్రాస్‌రోడ్డు నుంచి నానక్‌రామ్‌గూడ రోటరీ వరకు సైకిల్‌ ట్రాక్‌ను హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేస్తోంది. ఔత్సాహిక సైక్లిస్టులు, ఫిట్‌నెస్ ప్రేమికులను ప్రోత్సహించేందుకు ఈ మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.

తాత్కాలిక సైకిల్ ట్రాక్‌లను శాశ్వతంగా నిర్మించడానికి సాధ్యాసాధ్యాలు లేని ప్రదేశాలలో అభివృద్ధి చేయనున్నారు. GHMC అధికారుల ప్రకారం.. ఏర్పాటయ్యే అన్నిసైకిల్ ట్రాక్‌ల వద్ద, సైక్లిస్టులను ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడానికి భద్రతా చర్యలు ఉంటాయి.

ప్రతిపాదన ప్రకారం, తాత్కాలిక ట్రాక్‌ల వద్ద, సైక్లిస్టుల కోసం లేన్లు ఏర్పాటు చేస్తారు. ఇతర వాహనాలు ట్రాక్‌లోకి ప్రవేశించకుండా బొల్లార్డ్‌లు ఉంచుతారు. అయితే, శాశ్వత ట్రాక్‌లకు ఇరువైపులా కాంక్రీట్ అడ్డంకులు ఉంటాయి. ఇవి సైక్లిస్టులను ట్రాఫిక్ నుండి వేరు చేస్తాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles