హైదరాబాద్: మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ (MANUU) 2023-2024 విద్యా సంవత్సరానికి మెరిట్ ఆధారిత రెగ్యులర్ మోడ్ కోర్సులకు ఆన్లైన్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.
ప్రవేశ ఆధారిత కోర్సుల కోసం దరఖాస్తు ఫారమ్‌లను ఆన్లైన్లో సమర్పించడానికి చివరి తేదీ మే 28, 2023. అయితే మెరిట్ ఆధారిత కోర్సుల దరఖాస్తు ఫారమ్‌లను జూలై 24 వరకు సమర్పించవచ్చు. ఉర్దూ మాధ్యమంలో ఉన్నత స్థాయి కోర్సులను అందించే ఏకైక విశ్వవిద్యాలయంగా మనూ(MANUU) గుర్తింపు పొందింది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) ద్వారా “A+” గ్రేడ్ సైతం ఈ ఉర్దూ యూనివర్సిటీ సొంతం చేసుకుంది.
విశ్వవిద్యాలయం PhD స్థాయిలో ఉర్దూ సంస్కృతి అధ్యయనాలు, M.Sc. (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ & జువాలజీ) మరియు M.Voc (మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ & మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ)లో తులనాత్మక అధ్యయనాలను ప్రారంభించింది.
ఇది ఇంగ్లీష్ టీచింగ్‌లో ఫుల్ టైమ్ పీజీ డిప్లొమా, పాష్టో, ఫ్రెంచ్, రష్యన్, ఇస్లామిక్ స్టడీస్‌లో పార్ట్‌టైమ్ డిప్లొమా ప్రోగ్రామ్‌లు, తెలుగు, కాశ్మీరీ, టర్కిష్లలో పార్ట్‌టైమ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లను కూడా ప్రవేశపెట్టింది.
ప్రవేశ ఆధారిత కోర్సులలో Ph.D. అరబిక్, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ, పర్షియన్ భాషలలో అనువాద అధ్యయనాలు; ఉమెన్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్, ఇస్లామిక్ స్టడీస్, హిస్టరీ, ఎకనామిక్స్, సోషియాలజీ, డెక్కన్ స్టడీస్, ఎడ్యుకేషన్, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ కోర్సులను అందిస్తోంది.
అంతేకాదు MBAతో పాటు మేనేజ్మెంట్, కామర్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్ సైన్స్, ఉర్దూ కల్చర్ స్టడీస్ మరియు కంపారిటివ్ స్టడీస్; MCA; M. టెక్ (కంప్యూటర్ సైన్స్); M.Ed., B.Ed., B.Tech. (కంప్యూటర్ సైన్స్); B.Tech కంప్యూటర్ సైన్స్ (లాటరల్ ఎంట్రీ), D.El.Ed.; పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ (సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ మరియు అపెరల్ టెక్నాలజీస్) మరియు పాలిటెక్నిక్-డిప్లొమా లేటరల్ ఎంట్రీ. మెరిట్ ఆధారిత PG, డిప్లొమా కోర్సుల గురించి వివరాల కోసం ప్రాస్పెక్టస్ చూడొచ్చు.
లక్నో & శ్రీనగర్ క్యాంపస్‌లో MA & PhD కోర్సులు అందుబాటులో ఉన్నాయి. Bed కోర్సు CTE భోపాల్, దర్భంగా, శ్రీనగర్, అసన్సోల్, ఔరంగాబాద్, సంభాల్, నుహ్, బీదర్‌లలో అందుబాటు ఉంది. M.Ed, Ph.D CTE భోపాల్, దర్భంగాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
- మరిన్ని వివరాల కోసం లేదా ఏవైనా స్పష్టీకరణల కోసం ఆసక్తి గల అభ్యర్థులు admissionsregular@manuu.edu.inకు ఇమెయిల్ చేయవచ్చు.
- సాధారణ ఎంక్వైరీ, అడ్మిషన్ కోసం, హెల్ప్ డెస్క్‌ను ఈ నంబర్లలో సంప్రదించవచ్చు: 6207728673, 9866802414, 6302738370, 852716470, 852716471
- online . దరఖాస్తు ఫారాలు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.