33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

నల్గొండలో కార్యకలాపాలు ప్రారంభించనున్న సొనాటా సాఫ్ట్‌వేర్ కంపెనీ!

హైదరాబాద్: రాష్ట్రంలోని టైర్-2 పట్టణాలకు ఐటీ, ఐటీ సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ప్రముఖ మోడర్న్‌నైజేషన్‌ ఇంజినీరింగ్ కంపెనీ సొనాటా సాఫ్ట్‌వేర్ నల్గొండ ఐటీ టవర్ నుంచి తమ కార్యకలాపాలను త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.  సొనాటా తన నల్గొండ కేంద్రంగా 200 ఉద్యోగ అవకాశాలను అందించనుంది. ఇది కాకుండా, సనోఫీ, పై హెల్త్‌తో సహా సంస్థలు కూడా యునైటెడ్ స్టేట్స్‌లోని తెలంగాణ ప్రతినిధులతో సమావేశమై తెలంగాణ కోసం తమ ప్రణాళికలపై చర్చించాయి.

సోనాటా సాఫ్ట్‌వేర్ ఈవీపీ శ్రీని వీరవెల్లి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుతో బోస్టన్‌లో సమావేశమైన తర్వాత సొనాటా సాఫ్ట్‌వేర్ ప్రకటన వెలువడింది.  బ్యాం కింగ్‌, ఫైనాన్షియల్‌ సెక్టార్‌, ఆరోగ్య రంగం, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లో సేవలు అందించేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, టెక్నాలజీ ఇన్నోవేషన్ల కోసం సొనాటా కార్యకలాపాలు నిర్వహించనున్నది. ఇకడ కార్యకలాపాలు ప్రారంభించనున్న కంపెనీ, స్థానిక యువతకు టెక్నాలజీ రంగంలో నైపుణ్య శిక్షణను కూడా కల్పించనున్నది.

సనోఫీ కంపెనీ కేంద్రం ఏర్పాటుతో 350 ఉద్యోగాలు

గ్లోబల్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం సనోఫీ లీడర్‌షిప్ బృందం తెలంగాణ ఐటి, పరిశ్రమల మంత్రి కెటిఆర్ సమావేశమయ్యింది. ఈ ఏడాది ప్రారంభంలో హైదరాబాద్‌లో సనోఫీ కంపెనీ 350 ఉద్యోగాలతో కేంద్రాన్ని ప్రకటించింది.హైదరాబాద్ కేంద్రం తమ గ్లోబల్ టాలెంట్ హబ్‌లలో ఒకటని కంపెనీ తెలిపింది. ఈ రకమైన పెట్టుబడులు సాంకేతిక పురోగతిలో ముందంజలో ఉండటానికి, ఆరోగ్య సంరక్షణలో భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ నిబద్ధతను ప్రదర్శిస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్‌లో పై హెల్త్ రీసెర్చ్ సెంటర్

హైదరాబాద్‌లో అత్యాధునిక టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని పై హెల్త్ నిర్ణయించింది. బోస్టన్‌లో జరిగిన సమావేశంలో ‘పై హెల్త్’ సహ వ్యవస్థాపకులు డాక్టర్ బాబీ రెడ్డి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావుతో సమావేశమయ్యారు. అనంతరం హైదరాబాద్‌లో సమీకృత క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని పై హెల్త్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ తెలిపారు.

హైదరాబాద్‌లో అత్యాధునిక టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి ఇ విష్ణువర్ధన్‌రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్‌నాథ్‌రెడ్డి ఆత్మకూరి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles