28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

‘రాజ్ భవన్‘లో ఘనంగా గణతంత్ర దినోత్సవం… జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ తమిళసై!

హైదరాబాద్: రాజ్‎భవన్ లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పలువురు ఉన్నాతాధికారులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ తమిళసై ప్రసంగించారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు, రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళసై గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనదని, అత్యుత్తమ రాజ్యాంగం అందించిన దార్శనికులకు నివాళులర్పిస్తున్నాని తెలిపారు. వ్యాక్సినేషన్‌లో ప్రపంచంలోనే మనం ముందున్నందుకు గర్వంగా ఉందని గవర్నర్ తమిళసై పేర్కొన్నారు. త్వరలోనే 200 కోట్ల డోసుల పంపిణీని పూర్తి చేసుకోనున్నాం. హైదరాబాద్ ‘మెడికల్ హబ్‘గా ఎదగడం సంతోషించదగ్గ విషయం. విద్యా వ్యవస్థలో తెలంగాణ దూసుకు పోతుంది. తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఎదిగింది. రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలిపిన రైతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్. కొవిడ్ దృష్ట్యా గణతంత్ర వేడుకలను పబ్లిక్ గార్డెన్స్ నుంచి
‘రాజ్ భవన్‘కు మార్చిన సంగతి తెలిసిందే.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles