33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

నల్గొండలో తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ (TIF) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్!

హైదరాబాద్: నల్గొండ దండు మల్కాపూర్‌లోని టిఐఎఫ్ ఎంఎస్‌ఎంఇ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ (టిఐఎఫ్) స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ కామన్ ఫెసిలిటీ సెంటర్‌ను తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ప్రారంభించారు.

సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ ప్రభుత్వం సమ ప్రాథాన్యత ఇచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని కెటిఆర్ అన్నారు. దేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం దేశంలోనే కాదు ప్రపంచంలోని ఉత్తమమైన పనితీరుతో పారిశ్రామికంగా దూసుకెళ్తోందని అన్నారు.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధిలో అరుదైన సంగమాన్ని చూస్తోందని కేటీఆర్ అన్నారు.

40 వేల మందికి ఉద్యోగాలు

కాగా పరిశ్రమలు ఏర్పాటు చేసిన యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం 2019 తెలంగాణ పారిశ్రామికవేత్తల ఫెడరేషన్‌ (టీఐఎఫ్‌) ఆధ్వర్యంలో ఈ పార్క్‌ను ఏర్పాటు చేసింది. 542 ఎకరాల్లో 400 పైగా పరిశ్రమల ఏర్పాటు కొనసాగుతున్నది. మూడు దశల్లో దీనిని అభివృద్ధి చేస్తున్నారు. కరోనా కష్ట కాలంలో కూడా అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం ముందుకు సాగింది. ఈ క్రమంలో సుమారు 4 ఏండ్లలోనే పార్క్‌ను లక్ష్య దిశగా అడుగులు పడ్డాయి. పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే సుమారు 40 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి.

ఇప్పటికే ఇక్కడ సుమారు 2 నుంచి 3 వేల మంది ఉపాధి పొందుతున్నారు. దీనికి తోడు 5 ఎకరాల స్థలంలో 2 లక్షల స్కోర్‌ ఫిట్‌తో సుమారు రూ.40 కోట్లతో కామన్‌ ఫెసిలిటీ ఈ కేంద్రాన్ని 2021 జనవరి 22న శంకుస్థాపన చేశారు. దాదాపు ఏడాదిన్నరలోనే యుద్ధ్ద ప్రతిపాదికన పనులు చేపట్టి బహుళ అంతస్తులు నిర్మించారు. ఈ సెంటర్‌ను రెండు బ్లాకులుగా నిర్మిస్తున్నారు. రెండు భవనాలను ఐదు అంతస్తులుగా నిర్మిస్తున్నారు. మొదటి బ్లాకు భనంలో సమావేశ మందిరాలు, నైపుణ్య శిక్షణ కేంద్రం, అడిటోరియం, ఐలా, టీఫ్‌ కార్యాలయాలు, రెస్టారెంట్ల, బ్యాంకులను నిర్మాణం చేశారు. రెండో భవనంలో వస్తువులను ప్రదర్శన చేసేందుకు ప్రత్యేక మార్కెట్‌తోపాటు, కార్యాలయాలు, వసతి గదులు, ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పనులు పూర్తయ్యాయి.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles