31 C
Hyderabad
Tuesday, October 1, 2024

యూనిఫామ్ సివిల్ కోడ్…అందరి దృష్టి కేసీఆర్, జగన్ వైపే!

హైదరాబాద్: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, బిజెపి నేతృత్వంలోని కేంద్రం యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC)ని ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన తీసుకొచ్చింద. ఈ నేపథ్యంలో తెలుగు మాట్లాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇది పెద్ద సవాల్‌గా మారింది. ఈ విషయంలో తెలుగు ముఖ్యమంత్రులు ఎలాంటి వైఖరి అవలంబిస్తారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

రాజకీయ పరిశీలకులను ఉటంకిస్తూ ఈరోజు పయనీర్ దినపత్రికలో ప్రచురితమైన నివేదిక ప్రకారం, యుసిసిపై నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంటే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపైనే ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలోని ముస్లిం సమాజంపై ఎక్కువ ప్రభావాన్ని చూపనుంది.

లోక్‌సభ ఎన్నికలకు ముందే యూసీసీని ప్రవేశపెట్టాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. భోపాల్‌లో జరిగిన బిజెపి కార్యకర్తల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల చేసిన ప్రసంగం దీనికి ప్రబల సాక్ష్యం అనుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా తెలంగాణలో ముస్లిం ఓటు బ్యాంకుకు గణనీయమైన ఆధిక్యత ఉంది. తెలంగాణలోని దాదాపు 25 అసెంబ్లీ నియోజకవర్గాలు ముస్లిం ఓటర్లపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి, ఇది ఈ ప్రాంతంలోని రాజకీయ పార్టీల అవకాశాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది.

ఇప్పటి వరకు, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) భారతీయ రాష్ట్ర సమితి (BRS)తో స్నేహపూర్వక మైత్రిని కొనసాగించింది, రెండు పార్టీలు ముస్లిం మద్దతుపై ఆధారపడి ఉన్నాయి. అయితే, ఇటీవలి పరిణామాలు AIMIM వైఖరిలో  మార్పును సూచిస్తున్నాయి, వారు కాంగ్రెస్ పార్టీతో మరింత సన్నిహితంగా మెలిగే సూచనలు ఉన్నాయి.

యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) ప్రతిపాదన చుట్టూ అభివృద్ధి చెందుతున్న డైనమిక్స్,  ముస్లిం ఓటు బ్యాంకుకు సంబంధించి తెలుగు-మాట్లాడే రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ AIMIM, కాంగ్రెస్ వంటి  పార్టీల  పొలిటికల్ సినారియోని రూపొందిస్తాయని భావిస్తున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles