30.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

బీఆర్ఎస్ పాలనలో ప్రజారోగ్యానికే అధిక ప్రాధాన్యం… మంత్రి నిరంజన్‌రెడ్డి!

మహబూబ్‌నగర్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ.. ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా నిరుపేదలకు ఆసరాగా నిలుస్తోంది. ఆరోగ్య శ్రీ సేవల కిందికి రాని శారీరక రుగ్మతలకు ఈ పథకం ఆపన్నహస్తంలా నిలుస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువ ఉండి వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్న ఎంతోమందికి ఈ పథకం ఆదుకుని వారి ప్రాణాలు కాపాడుతోంది.

వనపర్తికి చెందిన మాసుమ్‌బాబా అనే అస్వస్థతకు గురైన రోగి చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి రూ.లక్ష ఆర్థిక సాయం అందించేందుకు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమ్మతి పత్రాన్ని (ఎల్‌ఓసీ) అందజేశారు.

సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యంత నాణ్యమైన చికిత్స అందించడమే కాకుండా, ఆరోగ్యశ్రీ ఆరోగ్య బీమా పథకం కింద కార్పొరేట్ ఆసుపత్రులలో పేదలకు ప్రత్యేక చికిత్సను కూడా అందిస్తున్నామన్నారు. పేదలను ఆదుకునేందుకు సీఎంఆర్‌ఎఫ్‌ సాయం పేదల్లో నిరుపేదలకు విరివిగా అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధునాతన మౌలిక సదుపాయాలు, పరికరాలను ఏర్పాటు చేయడంతోపాటు ఖాళీలను భర్తీ చేయడంతోపాటు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, వైద్యరంగం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను స్పష్టంగా తెలియజేస్తోందని మంత్రి ఉద్ఘాటించారు.

హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు వీలు మంత్రి చేతుల మీదుగా సమ్మతి పత్రాన్ని (ఎల్‌ఓసీ) అందుకున్న తర్వాత మాసుమ్ బాబా, అతని బంధువులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles