33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవల కోసం 466 కొత్త వాహనాలు!

హైదరాబాద్:  రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవల కోసం ప్రస్తుతం ఉన్న 108 ఎమర్జెన్సీ వాహనాలు, అమ్మ ఒడి 102 వాహనాలు, పార్థివ దేహాలను తరలించే వెహికల్స్ మొత్తం 466 కొత్త వాహనాలను ఆగస్టు 1న  ప్రారంభించనుంది.

వీటిలో 204 వాహనాలు 108 అంబులెన్స్‌లు, 228 అమ్మ ఒడి రవాణా వాహనాలు కాగా, మృతదేహాలను వారి స్వస్థలానికి ఉచితంగా తరలించడానికి 34 హియర్స్ వాహనాలు, ప్రత్యేక సేవలను అందిస్తున్నాయి.

ప్రస్తుతం 108 ఎమర్జెన్సీ ఫ్లీట్‌లో 426 వాహనాలు ఉన్నాయి, వాటిలో 175 వాహనాలను కొత్త వాటితో భర్తీ చేస్తున్నారు. 29 కొత్త అంబులెన్స్‌లు కొత్త రూట్లలో తిరగన్నాయి. ఆగస్టు 1 నుంచి 108 ఎమర్జెన్సీ సర్వీసెస్‌లో మొత్తం 455 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి.

ప్రస్తుతం అమ్మ ఒడిలో 300 నాన్ ఎమర్జెన్సీ వాహనాలు ఉండగా అందులో 228 వాహనాలను భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా, ప్రస్తుతం ఉన్న 34 పాత హార్స్ వాహనాల స్థానంలో అదే సంఖ్యలో కొత్త వాహనాలు వస్తున్నాయి.

ఈ సందర్భంగా  వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… 108, 102 వాహనాలతో పాటు పార్థివ దేశాలను తరలించే హర్సె వాహనాలు విలువైన సేవలు అందిస్తున్నాయన్నారు. అయితే వాటిలో కొన్ని వాహనాలు కాలం చెల్లిపోవటంతో సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో 466 కొత్త వాహనాలు సమకూర్చుకుంటున్నామన్నారు. వీటి రాకతో ప్రజలకు వైద్యసేవలు మరింత వేగంగా అందుతాయని, గర్భిణులు, బాలింతలను ఉచితంగా చేర్చే 102 వాహనాలను మరింత సౌకర్యవంతంగా రూపొందించి  అందుబాటులోకి తెస్తున్నాం అని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles