23.7 C
Hyderabad
Monday, September 30, 2024

సూర్యాపేట‌లో రైతుల‌తో సీఎం కేసీఆర్ ముచ్చ‌ట‌

హైదరాబాద్: సూర్యాపేటలో నూతనంగా నిర్మించిన ప్రారంభించిన సమీకృత వ్యవసాయ మార్కెట్‌ను ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖర్ రావు ప్రారంభించారు. ఈ సమీకృత శాకాహార, మాంసాహార మార్కెట్‌ను రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించారు. అనంతరం మార్కెట్‌ అంతా కలియతిరుగుతూ అక్క‌డి రైతు రైతులు, కూర‌గాయ‌ల విక్రేతలతో సీఎం ముచ్చ‌టించారు. వారి ప‌రిస్థితులు గురించి ఆరా తీశారు. మార్కెట్‌లో రైతులతో మాట్లాడిన సీఎం  వారు పండిస్తున్న పంట‌ల గురించి, సాగు ద్వారా వచ్చే ఆదాయాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు.

మార్కెట్ విక్రేతలతో ముచ్చటించిన అనంతరం సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్నిసీఎం కేసీఆర్ ప్రారంభించారు. మల్లాపూర్‌లో నూతనంగా నిర్మిస్తున్న వైకుంఠ ధామాన్ని ఆయన సందర్శించారు.

అనంతరం ఏర్పాటు చేసిన ‘ప్రగతి నివేదన సభ’లోనూ సీఎం మాట్లాడారు. సూర్యాపేటకు వరాలజల్లు ప్రకటించారు. మంత్రి జగదీష్ రెడ్డి సహా ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ‘మనం నిర్మించుకుంటున్న కొత్త కలెక్టరేట్లను చూసి ఇతర రాష్ట్రాల వారు ఆశ్చర్యపోతున్నారు. కొన్ని రాష్ట్రాల సెక్రటేరియట్‌లు కూడా ఇంత బాగా ఉండట్లేదు’ అని కేసీఆర్ అన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో పండే వడ్లను తరలించేందుకు లారీలే సరిపోవట్లేదని కేసీఆర్ చెప్పారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను దాటేశామని చెప్పారు. ఈ సీజన్‌లో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేశామని తెలిపారు. పాలమూరు – రంగారెడ్డి, ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టులు పూర్తైతే రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 4 కోట్ల టన్నులను దాటుతుందని కేసీఆర్ చెప్పారు.

‘హైదరాబాద్‌ను కూడా విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నాం. ఎన్నో పనులు చేసుకున్నం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి’ అని కేసీఆర్ చెప్పారు. సూర్యాపేట జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు, జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు రూ. 25 కోట్లు, సూర్యాపేట మున్సిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles