23.7 C
Hyderabad
Monday, September 30, 2024

రైతు బంధు కింద 68.99 లక్షల రైతులకు రూ.7624 కోట్లు పంపిణీ!

హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో పంట పెట్టుపడి సాయం కోసం రైతు బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ఈ పథకం కింద ఎకరానికి రూ. 10 వేలు రెండు దఫాలుగా అందిస్తోంది. వర్షకాల సీజన్, రబీ సీజన్లలో రైతులు ఖాతాల్లో ఎకరాకు రూ. 5 వేలు జమ చేస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ (వానకాలం)11వ విడత  రైతుబంధు సాయం కింద 68.99 లక్షల మంది రైతులకు రూ.7624.74 కోట్ల సొమ్మును రైతుల ఖాతాల్లోకి విజయవంతంగా జమ చేశారు.

రైతు బంధు పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన రైతు పెట్టుబడి పథకం, ఇది రైతులకు పంటకు పెట్టుబడిగా ప్రతి ఎకరా భూమికి రూ. 5000 ప్రోత్సాహకాన్ని అందిస్తుంది.

జూన్ 26న ఖరీఫ్ సీజన్ కోసం ప్రారంభించిన రైతుబంధు రెమిటెన్స్‌లు రెండు నెలల్లోపే పూర్తయ్యాయి. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 5.87 లక్షల మంది రైతులకు రూ.609.67 కోట్లు పంపిణి చేయగా, మేడ్చల్-మల్కాజిగిరిలో 35,879 మంది రైతులకు రూ.33.60 కోట్ల వాటా వచ్చింది. ఈసారి అదనంగా ఐదు లక్షల మంది రైతులు లబ్ధిదారుల జాబితాలోకి చేరారు.

వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌ నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. 11వ విడత రైతుబంధు విజయవంతంగా పూర్తి చేసుకున్నామని, మొత్తం ఇప్పటి వరకు రూ.72,815.09 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేశామన్నారు. రైతుబంధు సాయాన్ని రైతులకు పెద్దఎత్తున అందజేయడం వల్ల రైతుల గుండెల్లో సీఎంకు శాశ్వత స్థానం లభిస్తుందని అన్నారు.

గతం కన్నా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.300 కోట్ల అదనపు భారం పడింది. 10వ విడత వరకు రూ.65,190 కోట్లు జమ చేశారు. ఎప్పటి మాదిరిగానే ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేశారు. మొదట ఎకరం భూమి లోపు ఉన్న వారికి, ఆ తరువాత 2 ఎకరాలు, 5 ఎకరాలు ఇలా 11వ విడత పూర్తయ్యేసరికి అర్హులైన రైతలన్నల అందరికీ పంట నగదు సాయాన్ని అందజేశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles