33.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

సెప్టెంబర్ 1న నల్గొండ ఐటీ హబ్‌లో జాబ్ మేళా!

హైదరాబాద్‌: తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) నల్గొండ ఐటీ హబ్‌లో సెప్టెంబర్‌ 1న జాబ్‌ మేళాను నిర్వహించనుంది. 98 కోట్లతో నిర్మించిన ఐటీ హబ్‌ నిర్మాణ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి.

ఎంప్లాయిమెంట్ డ్రైవ్‌లో మొదటి దశలో 500 మందికి ఉపాధి కల్పించేందుకు మొత్తం 15 కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటాయి. టాస్క్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు.

ఎంపికైన వారికి రూ.1.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు నైపుణ్యాల ఆధారంగా వార్షిక వేతనం ఇవ్వనున్నారని ఎమ్మెల్యే వివరించారు. రూ.90 కోట్ల వ్యయంతో నల్గొండలో నిర్మిస్తున్న ఐటీ హబ్ సెప్టెంబర్ రెండో వారంలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

నల్గొండ జిల్లా నుంచి అమెరికా, తదితర దేశాలలో స్థిరపడి పెద్ద కంపెనీలు స్థాపించిన వారితో మంత్రి కేటీఆర్ మాట్లాడారని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తాను కూడా కంపెనీ వారితో మాట్లాడానని, కలెక్టర్, ఎస్పీ కూడా మాట్లాడి సహకారం అందిస్తామని చెప్పినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఇటీవల జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌, మున్సిపల్‌, టాస్క్‌ అధికారుల సమక్షంలో ఆవిష్కరించారు.

నల్గొండలో నిర్వహించే ఉద్యోగ మేళాకు http:///tinyurl.com/2xfm6wdc ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని చెప్పారు. టాస్క్ నల్గొండ క్లస్టర్ మేనేజర్ జె.సుధీర్ రెడ్డి, ప్లేస్మెంట్స్ డైరెక్టర్ ప్రదీప్ రెడ్డి, జిల్లా శంకర్ తదితరులు పాల్గొన్నారు.

సెప్టెంబర్ 1న రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభం కాగా, సెప్టెంబర్ రెండో వారంలో ఐటీ హబ్ పని ప్రారంభించనున్నట్లు సమాచారం. ఐటీ హబ్‌ నిర్మాణ పనులు ఏడాది వ్యవధిలో రికార్డు స్థాయిలో పూర్తయ్యాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles