28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

కరీంనగర్‌లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు!

కరీంనగర్: అంతకంతకూ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలతో ప్రజలు తమ వెహికిల్స్ ను ఇళ్లకే పరిమితం చేసి  ఎలక్ట్రానిక్ వాహనాలను కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.  ఈ వెహికల్స్ నడిపే వారికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేకుండా, వాహనానికి రిజిస్ట్రేషన్ కూడా లేకుండా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీంతో పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా విద్యుత్ వాహనాలు కనిపిస్తున్నాయి.

ఒక్కసారి ఛార్జింగ్ పెడితే కనీసం 100 కిలోమీటర్ల దూరం వెళ్లే అవకాశం ఉండడంతో పరిసర ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రజలు కూడా వీటిని కొనుగోలు పై ఆసక్తి చూపుతున్నారు. అయితే వినియోగదారులను ఛార్జింగ్ భయం వెంటాడుతుంది. ఈ విషయాన్ని గమనించిన తెలంగాణ సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ కరీంనగర్‌లో ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా 128 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.

ఇందులో భాగంగా కరీంనగర్‌లో 72, పెద్దపల్లిలో 30, జగిత్యాలలో 14, రాజన్న సిరిసిల్లలో 12 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.

ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు స్పాట్‌లను గుర్తించడంతోపాటు వీటిని నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) కింద నిర్వహించనున్న ప్రతి స్టేషన్‌కు 1.5 గుంటల నుండి 3 గుంటల భూమి అవసరం ఉంటుంది.

తమ భూములను లీజుకు ఇచ్చేందుకు ఎన్‌పీడీసీఎల్‌, సాంకేతిక విద్య, కళాశాల విద్యాశాఖ తదితర ప్రభుత్వ శాఖలు ముందుకు వచ్చాయి.

తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TS REDCO) భూ యజమానులు,  దరఖాస్తుదారుల మధ్య లీజు ఒప్పందాలను ఇంక్ చేయడానికి ఫెసిలిటేటర్‌గా పనిచేస్తుంది. ఛార్జింగ్ స్టేషన్ల కోసం అనుమతులు పొందిన దరఖాస్తుదారులకు కేటగిరీ-9 కింద సబ్సిడీ విద్యుత్ అందించనున్నారు. ఒక్కో యూనిట్ ఛార్జింగ్‌కు వాహన యజమానుల నుంచి రూ.18 వసూలు చేస్తారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన TSREDCO జిల్లా మేనేజర్, V పరమాచారి, EV ఛార్జింగ్ స్టేషన్ల కోసం అనేక ప్రభుత్వ సంస్థలు తమ భూములను అద్దెకు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయన్నారు.  తమ సొంత భూముల్లో స్టేషన్లు ఏర్పాటు చేయాలని పలువురు తమ వద్దకు వస్తున్నారని, ముందుగా గుర్తించిన ప్రభుత్వ భూముల్లోనే స్టేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం ప్రైవేటు భూముల్లో స్టేషన్ల ఏర్పాటుకు అనుమతి ఇస్తారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles