24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడలో మినీ స్టేడియం…రూ.3.7 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం!

మహబూబ్‌నగర్: జిల్లాలో క్రీడల అభివృద్ధికి హన్వాడ మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3.7 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు  ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్  మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోనూ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామని, క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి అన్నారు.

ఈ మేరకు ఆదివారం రాత్రి హన్వాడ మండల ప్రజా ప్రతినిధులు జిల్లా కేంద్రంలోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. హన్వాడ మండల కేంద్రానికి మినీ స్టేడియం మంజూరు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను మంత్రి వారికి అందించారు. మండల స్థాయిలోనూ మినీ స్టేడియం ఏర్పాటు ద్వారా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. హన్వాడ మండల కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు అవుతుందని తాము కలలో కూడా ఊహించలేదని మండల నాయకులు మంత్రికి తెలిపారు. మండల ప్రజల అందరి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో తెలంగాణ రూరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, వీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కరుణాకర్ గౌడ్, ముడా డైరెక్టర్ కొండా బాలయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ కృష్ణయ్య గౌడ్, మండల కో ఆప్షన్ సభ్యుడు మన్నన్, ఎంపీటీసీ యాదయ్య, సర్పంచులు రేవతి సత్యం, వెంకన్న, సురేష్, లక్ష్మీనారాయణ, నాయకులు జంబులయ్య, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles