23.7 C
Hyderabad
Monday, September 30, 2024

భారత దేశ స్టార్టప్‌ పవర్‌ హౌస్‌గా హైదరాబాద్‌!

హైదరాబాద్: మన దేశపు తదుపరి స్టార్టప్ పవర్‌హౌస్‌గా హైదరాబాద్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. అంతేకాదు భారతదేశంలోని టాప్-5 స్టార్టప్ హబ్స్‌లో మన హైదరాబాద్ మహానగరం ఒకటిగా నిలిచింది. ఇప్పటికే టెక్ హబ్‌గా పేరున్న బెంగళూరు, ముంబై, దిల్లీ- NCR, పుణె నగరాలు మన కంటే ముందున్నాయి. హైదరాబాద్‌లో స్టార్టప్ ఎకోసిస్టమ్ బలపడుతోందని.. ఇప్పటివరకు సుమారుగా 900 మిలియన్ డాలర్ల ఇన్వె్స్ట్‌మెంట్లు రావడమే దీనికి నిదర్శనం.

గత మూడేండ్లలోనే ఒకేసారి 240 స్టార్టప్‌లకు భారీ మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి. అత్యాధునిక మౌలిక వసతులు, పరిమిత వ్యయంతో స్టార్టప్‌లను సమర్థంగా నిర్వహించే అత్యంత అనుకూల వాతావరణం ఉండటంతో స్టార్టప్‌ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు హైదరాబాద్‌నే తమ గమ్యస్థానంగా ఎంచుకొంటున్నారు. బెంగళూరును సైతం వెనక్కి నెట్టి హైదరాబాద్‌ పెట్టుబడులను ఆకర్షిస్తున్నది. ప్రధానంగా టీ-హబ్‌ ఏర్పాటు స్టార్టప్‌ రంగానికి ఎంతో ఊతమిచ్చేలా మారింది.

అదేవిధంగా ఐఐటీ-హైదరాబాద్‌ వంటి అగ్రశేణి విద్యాసంస్థల నుంచి నైపుణ్యం కలిగిన మానవవనరుల లభ్యత స్టార్టప్‌ రంగం మరింత వృద్ధి చెందేందుకు దోహదం చేస్తున్నది. మొత్తంగా హైదరాబాద్‌ మహానగరం బీ2బీ, సాస్‌ (ఎస్‌ఏఏఎస్‌), తయారీ, ఫిన్‌టెక్‌, ఐటీ రంగాలకు దిక్సూచిగా మారుతున్నది. ఈ మేరకు ప్రముఖ స్టార్టప్‌ మీడియా ప్లాట్‌ఫాం ఇంక్‌42 తాజా నివేదికలో వెల్లడించింది.

దేశవ్యాప్తంగా స్టార్టప్‌లకు 2014 నుంచి 2023 వరకు ఆకట్టుకునే స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. ఇందులో 1,900 ఒప్పందాల ద్వారా 141 బిలియన్‌ డాలర్ల నిధులు సమకూరాయి. స్టార్టప్‌ల కోసం పెట్టుబడిదారులు గతంలో ఢిల్లీ ఎన్‌సీఆర్‌, ముంబై, బెంగళూరు వంటి అగ్రశేణి నగరాలపై దృష్టి సారించేవారు. కానీ స్టార్టప్‌ రంగంలో హైదరాబాద్‌ క్రమంగా స్థానాన్ని పెంచుకుంటూ గణనీయమైన పెట్టుబడులను ఆకర్షిస్తున్నది.

రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలను (ఇన్నోవేషన్‌ ఎకో సిస్టం) వృద్ధిచేసేందుకు టీ-హబ్‌, టీఎస్‌ఐసీ, వీ-హబ్‌, రిచ్‌, టాస్క్‌, టీ-వర్క్స్‌, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ వింగ్‌, ఇమేజ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేశారు. మెంటార్‌షిప్‌, ఇంక్యుబేషన్‌, పరిశ్రమల అనుసంధానం చేయడంతో వందల స్టార్టప్స్‌ మద్దతు పొందాయి. దీన్ని మరింతగా విస్తరించేందుకు రాష్ట్ర స్థాయిలో స్టార్టప్‌లకు ప్రత్యేకంగా గుర్తింపు వచ్చేలా చేసేందుకు ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles