28.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

వివిధ మాధ్యమాల ద్వారా ప్రసారమయ్యే రాజకీయ ప్రకటనలపై ‘ఈసీ’ నిఘా!

కరీంనగర్: రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో  కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కఠినంగా అమలు చేయడంలో భాగంగా ఆయా జిల్లాల్లో ఏర్పాటయ్యే మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (MCMC) వివిధ మాధ్యమాల ద్వారా ప్రసారమయ్యే ప్రకటనలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ గోపి  జిల్లా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ), మీడియా సెంటర్‌ను  ప్రారంభించారు. రాజకీయ ప్రకటనల కోసం కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు వివిధ శాఖలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ సభ్యులు వివిధ వార్తాపత్రికలు, టెలివిజన్, ఇతర మాధ్యమాలు ప్రచురించే పెయిడ్ న్యూస్, రాజకీయ ప్రకటనలను నిరంతరం తనిఖీ చేయాలన్నారు. అంతేకాదు అటువంటి  ప్రకటనలకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు సిద్ధం చేసి ఎన్నికల అధికారులకు పంపాలని సూచించారు. అడ్వర్టైజ్‌మెంట్‌లకు సంబంధించి MCMC అనుమతి తప్పనిసరిగా పొందాలి. డిఆర్‌ఓ (ఇంఛార్జి) పవన్ కుమార్, సమాచార శాఖ సహాయ సంచాలకులు అబ్దుల్ కలీం, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ సిహెచ్. కొండయ్య, ఏఓ సుధాకర్ డీఐవో శివరాములు, డీవైఈవో వెంకట రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles