24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

తాగునీటి కోసం రాష్ట్రానికి 8.5 టీఎంసీల నీటిని కేటాయించిన కృష్ణా బోర్డు!

హైదరాబాద్: తాగునీటి అవసరాల కోసం కృష్ణా నది నుంచి తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 5.5 టీఎంసీల నీటిని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) శుక్రవారం కేటాయించడంతో నాగార్జున సాగర్ డ్యాం నుంచి నీటిని ఎత్తిపోయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

కేఆర్ఎంబీలో ఉన్న మొత్తం నీటి ల‌భ్యత 14 టీఎంసీలు ఉండ‌గా, ఇందులో తెలంగాణ‌కు 8.5, ఏపీకి 5.5 టీఎంసీల నీటిని కేటాయించారు. మే నెల‌లో మ‌రోసారి తాగునీటి స‌మ‌స్య‌ల‌పై త్రిస‌భ్య క‌మిటీ భేటీ కానుంది. మే నెల‌లో జరిగే సమావేశంలో పులిచింతల కృష్ణా అవసరాల కోసం మరోసారి రివ్యూ చేస్తామ‌న్నారు.

జంట జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో కొద్దిపాటి నీరు ఉన్న నేపథ్యంలో జూన్‌ వరకు జాగ్రత్తగా తాగునీటి అవసరాల కోసం వాడుకునే విషయమై సమావేశంలో మాట్లాడారు. గత ఏడాది అక్టోబరులో తీసుకున్న నిర్ణయాలు, ప్రస్తుత అవసరాలపై దీర్ఘంగా చర్చించారు.

ఈ వేసవిలో హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు సింగూరు జలాశయం నుంచి కూడా నీటిని తీసుకోవాలని నిర్ణయించారు.  నగరంలో తాగునీటి సరఫరాను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్న కొంతమంది అధికారులను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నికల సమయం కావడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా తప్పుడు ఫిర్యాదులు, తప్పుడు నివేదికలు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు. ఇలాంటి విషయాలపై వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని అధికారులను కోరారు.

అంతేకాదు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. మండుతున్న ఎండల దృష్ట్యా రానున్న రెండు నెలలు మరింత కీలకం కానున్నాయని హెచ్చరించారు. గత ఏడాదితో పోల్చితే ఎక్కువ తాగునీరు సరఫరా అవుతున్నప్పటికీ ప్రజల నీటి అవసరాలు తీరడం లేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles