24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

ఆటో డ్రైవర్ నిజాయితీ… 10 తులాల బంగారు ఆభరణాలు అప్పగింత!

హైదరాబాద్: ఈరోజుల్లో అడుగడుగునా మోసాలు జరుగుతున్నాయి. ఆటోలలో ప్రయాణించే ప్రయాణికులు సెల్ ఫోన్లు, డబ్బు సంచులు, బంగారు ఆభరణాలు  పోగొట్టుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. అయితే విశ్వ నగరం హైదరాబాదులో ఆటో డ్రైవర్లలో కొందరు తమ నిజాయితీని చాటుకుంటున్నారు. తాజాగా నగరంలో ఓ ఆటోడ్రైవర్ నిజాయితీకి పోలీసులు అభినందనలు అందుకున్నారు. నిజాయితీ గల ఆటో డ్రైవర్ సయ్యద్ జాకర్ తనకు లభించిన 10 తులాల బంగారాన్ని పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు. లంగర్హౌస్ కు చెందిన మీర్జా సుల్తాన్ బేగ్, సమీరాబేగం దంపతులు మెహిదీపట్నంలో బంగారు నగలు కొనుగోలు చేశారు. అనంతరం తమ బైక్పై లంగర్హౌస్కు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే మార్గమధ్యంలో నగలున్న బ్యాగు ఎక్కడో పడిపోయింది. ఇంటికి వెళ్లాక ఆ విషయాన్ని గమనించిన దంపతులు పోలీసులను ఆశ్రయించారని  లంగర్‌ హౌస్‌ పోలీస్‌ స్టేషన్‌ SHO కె శ్రీనివాస్‌ తెలిపారు.  ఆసిఫ్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ సయ్యద్ జకీర్కు పిల్లర్ నెంబర్ 55 వద్ద ఓ బ్యాగు దొరికింది. దాన్ని ఓపెన్ చేసి చూడగా.. దాదాపు రూ.5లక్షల విలువైన 10తులాల బంగారు నగలు ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ బంగారు ఆభరణాలను పోలీసులకు అందజేశాడు. అప్పటికే బాధితులు తమ బంగారు ఆభరణాలున్న బ్యాగ్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు వారికి సమాచారం ఇచ్చారు. ఇన్స్పెక్టర్ సమక్షంలో బాధితులకు బంగారు నగలను అందజేశారు. నిజాయితీతో వ్యవహరించిన ఆటో డ్రైవర్ సయ్యద్ జకీర్ను పోలీసులు సన్మానించారు. “పేదవాడైనప్పటికీ, మనకి చెందని వస్తువును దొంగిలించకూడదని, తీసుకోకూడదని ఈ రోజు ఆ అబ్బాయి నాకు నేర్పించాడు” అంటూ జాకీర్ నిజాయితీని కె శ్రీనివాస్ కొనియాడారు. https://twitter.com/ani/status/1491253642472865794?s=12

మొన్నటికి మొన్న సికింద్రాబాద్ దగ్గర ప్రయాణీకులు తన ఆటోలో మర్చిపోయిన రూ.10లక్షల బ్యాగును తిరిగి అప్పజెప్పిన ఆటో డ్రైవర్ శభాష్ అనిపించుకున్నాడు. పోలీసులతో పాటూ డబ్బు పోగొట్టుకున్న ప్రయాణికుల మనసులు గెలిచి.. 10వేలు బహుమతిగా అందుకున్నాడు. ఇటీవలే అంబర్​పేటలోనూ ఓ ఆటో డ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు. తన వాహనంలో మరిచిపోయిన బ్యాగును పోలీసుల సమక్షంలో బాధితులకు అప్పగించి ప్రశంసలు పొందాడు. ఈ ఘటన హైదరాబాద్​ అంబర్​పేట ఠాణాలో చోటుచేసుకుంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles