23.7 C
Hyderabad
Monday, September 30, 2024

బెంగుళూరులో రేవ్ పార్టీ…పట్టుబడ్డ తెలుగు సినీ ప్రముఖులు!

బెంగళూరు: బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీలో  తెలుగు సినీ ప్రముఖుల  దొరికిపోయారు. రేవ్ పార్టీ జరిగిన వేదిక – జీఆర్ ఫామ్ హౌస్ హైదరాబాద్‌కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినది. ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ నిర్వహించడంలో ఫామ్‌హౌస్ యజమాని పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల వరకు జరిగిన పార్టీలో నార్కోటిక్ డ్రగ్స్ వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

తెలుగు నటీనటులు పాల్గొన్న రేవ్ పార్టీ ఛేదించింది పక్కా సమాచారంతో పోలీసులు రేవ్ పార్టీపై దాడులు నిర్వహించారు. రేవ్ పార్టీలో డ్రగ్స్, కొకైన్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువ మంది ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం.

రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పేరు మీద పాస్ ఉన్న కారు కూడా దొరికింది. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ సినీ సెలబ్రిటీలు ఎవరనే విషయం ఇప్పటి వరకు బయటకు రాలేదు.. నటి హేమ పేరు వార్తల్లోకి ఎక్కింది కానీ ఆమె దానిని కొట్టిపారేస్తూ తాను హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే ఉన్నానని చెప్పింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles