24.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

బడ్జెట్‌లో వలస కార్మికులకు 500 కోట్లు కేటాయించాలి…ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన గల్ఫ్ జేఏసీ!

హైదరాబాద్: ఈ ఏడాది బడ్జెట్‌లో గల్ఫ్‌ వలస కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్ల నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ గల్ఫ్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) బృందం పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌లకు వినతిపత్రం సమర్పించింది.

గల్ఫ్ వలసదారుల సంక్షేమానికి కొంత నిధులు కేటాయిస్తామని 2024 ఏప్రిల్ 16న తాజ్ డెక్కన్‌లో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని వారు కోరారు.

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ‘గల్ఫ్, ఇతర విదేశీ కార్మికుల సంక్షేమ బోర్డు’ (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలని సామాజిక కార్యకర్తలు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. గల్ఫ్ జేఏసీ నేతలు చివరిసారి ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా సెప్టెంబర్ 17లోగా గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అలాగే మరణించిన గల్ఫ్‌ వలసదారుల బంధువులకు 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేసేందుకు ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, గల్ఫ్‌ తదితర దేశాలకు వెళ్లిన వారిపై సమగ్ర సర్వే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. రేషన్ కార్డులు, ఓటరు జాబితాల్లో గల్ఫ్ కార్మికుల పేర్లను తొలగించవద్దని, వారి కుటుంబాలకు అన్ని సంక్షేమ పథకాలు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ బృందంలో తెలంగాణ గల్ఫ్‌ జేఏసీ నేత జీ మురళీధర్‌రెడ్డి, జీడబ్ల్యూఏసీ నేత దొనికేని కృష్ణ, రాష్ట్ర గల్ఫ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎస్‌ నరేష్‌రెడ్డి, టీపీసీసీ ఎన్నారై అధ్యక్షుడు ఎం భీమ్‌రెడ్డి, గల్ఫ్‌ జేఏసీ సంయుక్త కార్యదర్శి టీ ధర్మేందర్‌ తదితరులున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles