24.2 C
Hyderabad
Tuesday, October 1, 2024

తెలంగాణ ఇకపై ఫ్యూచర్‌ స్టేట్‌…సీఎం రేవంత్‌ రెడ్డి!

హైదరాబాద్‌: తెలంగాణలో పెట్టుబడులు రాబట్టే లక్ష్యంతో అగ్రరాజ్యం అమెరికాలో సీఎం పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. వివిధ కంపెనీల అధిపతులతో సమావేశాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… అమెరికాలో ప్రతి రాష్ట్రానికీ ఒక ప్రత్యేక లక్ష్యం ఉంది. దాన్ని సూచించే ఒక నినాదం (ట్యాగ్‌లైన్‌) ఉంది. న్యూయార్క్‌ స్టేట్‌కి ‘అవుటాఫ్‌ మెనీ.. వన్‌’.. టెక్సాస్‌‌కు ‘లోన్‌ స్టార్‌ స్టేట్‌’.. కాలిఫోర్నియాకు ‘యురేకా’ అనే నినాదాలున్నాయి. ఇవి నన్ను బాగా ఆకర్షించాయి. మన దేశంలోని రాష్ట్రాలకు ఇలాంటి ప్రత్యేక ట్యాగ్‌లైన్‌లేమీ లేవు. ఇకనుంచి తెలంగాణకు కూడా ఇలాంటి ట్యాగ్‌లైన్‌ను పెట్టుకుందాం. ఇకపై రాష్ట్రాన్ని ‘తెలంగాణ.. ఫ్యూచర్‌ స్టేట్‌’ అని పిలుద్దాం’’ అని సీఎం పిలుపునిచ్చారు.

తెలంగాణను దశాబ్ద కాలంలో ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే తన విజన్‌ను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. కాలిఫోర్నియాలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన AI బిజినెస్ రౌండ్‌టేబుల్‌లో టెక్ యునికార్న్‌ల CEOలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ హబ్‌, నెట్‌ జీరో సిటీ వంటి లక్ష్యాలు తమ ముందు ఉన్నాయన్నారు. అందుకే యూనీకార్న్‌ ప్రతినిధులంతా తెలంగాణకు రావాలని ఆహ్వానం పలికారు. ‘‘మా రాష్ట్రానికి రండి. మీ భవిష్యత్తును ఆవిష్కరించుకోండి. అందరం కలిసి సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం’’ అని పిలుపునిచ్చారు.

అలాగే, తన పర్యటనలో భాగంగా అడోబ్‌ సీఈవో శంతను నారాయణ్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్‌ 4.0 సిటీ నిర్మాణం, స్కిల్‌ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సిటీ ఏర్పాటు తదితర ప్రణాళికల్లో భాగస్వామి కా వాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.

ఏళ్ల తరబడి హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లను నిర్మించుకున్నామని సీఎం చెప్పారు. ఇప్పుడు, ప్రపంచ స్థాయి నాల్గవ నగరాన్ని ఫ్యూచర్ సిటీగా మార్చడానికి మనమందరం ప్రతినబూనుదాం అన్నారు. ఫ్యూచర్ సిటీ, మెట్రో పొడిగింపు, నది మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు వంటివన్నీ రాబోయే దశాబ్దంలో హైదరాబాద్‌ను పునర్నిర్మించాలనే పెద్ద వ్యూహంలో భాగమని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles