23.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

రాష్ట్రంలోని ‘వర్సిటీలు’ తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి… విద్యావేత్తల ఆందోళన!

హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీలు తమ ప్రాభవాన్ని కోల్పోయి కోచింగ్ సెంటర్లుగా మారుతున్నాయా? అన్న ఆందోళన విద్యావేత్తల్లో వ్యక్తం అవుతోంది.  వ్యవసాయ, సాంకేతిక వర్సిటీలు మినహా ఉస్మానియా, కాకతీయ తదితర సంప్రదాయ వర్సిటీలు  పరిశోధన కార్యకలాపాలు చేపట్టడంలో పూర్తి స్థాయిలో విఫలమవుతున్నాయని సమాచారం. కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు ఇంతకు ముందు అత్యుత్తమ పరిశోధకులను తయారు చేసిన రికార్డు ఉంది. అయితే ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్‌ను నిషేధించడం,  గత ప్రభుత్వాల అడుగుజాడల్లో కొత్త ప్రభుత్వాలు కొనసాగడం వర్సిటీలకు శాపంగా మారింది. ఉస్మానియా యూనివర్శిటీలోని లైఫ్ సైన్సెస్ సీనియర్ ప్రొఫెసర్ ఒకరు మీడియాతో మాట్లాడుతూ…  “ఒక విశ్వవిద్యాలయం ముఖ్యంగా పరిశోధన దాని అవుట్‌పుట్‌ ఆధారంగా గుర్తింపు పొందుతుంది. అయితే గత మూడు దశాబ్దాలుగా, అది కేవలం ప్రవేశాల నిర్వహణ, అడ్మిషన్లు తీసుకోవడం పార్ట్-టైమ్ ఫ్యాకల్టీతో తరగతులు నిర్వహించడం, డిగ్రీలను ప్రదానం చేయడం” మాత్రమే చేస్తోంది. మరో ప్రొఫెసర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, “మా పరిశోధనలకు ‘గైడ్‘లుగా వ్యవహరించిన ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల మాజీ ప్రొఫెసర్లు, యూనివర్సిటీ క్యాంపస్‌లను సందర్శించినప్పుడు… ప్రస్తుత  నాసిరక పరిశోధనలను చూసి బాధపడిన సంధర్భాలు చాలా ఉన్నాయి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు కోచింగ్ సెంటర్‌ల మాదిరిగా  మారుతున్నాయి” అని కాకతీయ విశ్వవిద్యాలయం సాంఘిక శాస్త్ర ప్రొఫెసర్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. అయినా విశ్వవిద్యాలయాలు  పెద్దగా ఏమీ మారలేదు” అని అతను చెప్పాడు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం  రెండు ప్రధాన సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇందులో మొదటి అంశం… ఇప్పటికే ఉన్న అధ్యాపకుల్లో అత్యధికులు రీసెర్చ్ స్కాలర్‌లే. వీరందరూ తమ డాక్టరల్ సమర్పణలను పూర్తి చేసే అవకాశం ఎంతమాత్రం లేదు. రెండవది, యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ (UGC) నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయాలు అధిక శాతం ఫ్యాకల్టీ-పరిశోధన ఆచార్యుల నిష్పత్తిని కలిగి ఉండాలి. అయితే ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ లేకపోవడంతో యూనివర్సిటీలు కుదేలయ్యాయి. “ప్రస్తుతం, విశ్వవిద్యాలయాల పరిశోధన, ఫ్యాకల్టీ-పరిశోధన ఆచార్యుల నిష్పత్తి పరంగా, దాని సామర్థ్యంలో 50 శాతం మాత్రమే ఉంది, ప్రతి విశ్వవిద్యాలయానికి పూర్తి మంజూరైన అధ్యాపకుల బలం ఉంటే పరిశోధనకు అనుమతి ఇవ్వబడుతుంది,” అని కాకతీయ విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. ఇక ఉస్మానియా విషయానికొస్తే, ఇది చివరిసారిగా 2017లో పరిశోధకులను చేర్చుకుంది. ప్రస్తుతం, ఇది జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) కోసం అర్హత పొందిన వారిని మాత్రమే రీసెర్చ్ స్కాలర్‌లుగా చేర్చుకుంటుంది. ఈ అంశంపై ఉన్నత విద్యా శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ, “సమస్య తీవ్రతను పరిశీలిస్తున్నామని అన్నారు. విశ్వవిద్యాలయ బోధన, బోధనేతర సిబ్బందిని భర్తీ చేసే విధానం… విధివిధానాల ఖరారుపై త్వరలో నిర్ణయం తీసుకోబడుతుందవి ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని డిపార్ట్‌మెంట్‌లోని సీనియర్ అధికారులు విద్యా మంత్రికి కూడా తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. త్వరలో యూనివర్సిటీ ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ సన్నాహాలు జరుగుతున్న సమయంలోనైనా దీన్ని గుర్తిస్తారో లేదో చూడాలి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles