24.7 C
Hyderabad
Tuesday, October 1, 2024

నగరంలోని సైన్ బోర్డుల్లో ఉర్దూ మాయం… ఆవేదన చెందుతున్న ఉర్దూ ప్రేమికులు!

హైదరాబాద్: ఉర్దూను రెండో అధికార భాషగా ప్రోత్సహిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పైకి ఎన్ని గొప్పలు చెబుతున్నా… క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నగరంలోని చాలా చారిత్రక, పర్యాటక ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారి సూచికలు, ఇలా ఎక్కడా ఉర్దూ సైన్ బోర్డులు లేకపోవడంతో చాలా మంది ఉర్దూ ప్రేమికులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. నగరంలోని గోల్కొండ కోట, సెవెన్‌ టూంబ్స్‌ (ఏడు సమాధులు), ‘పైగా’ సమాధులు, ఇతర పర్యాటక ప్రదేశాలలో సైన్‌బోర్డ్‌లలో ఉర్దూ కనిపించడం లేదని పలువురు ఉర్దూ ప్రేమికులు గళమెత్తారు. ఉర్దూ చాలా మంది నగరవాసులు మాత్రమే కాకుండా, వివిధ రాష్ట్రాల నుండి వచ్చే సందర్శకులు కూడా మాట్లాడతారు. ఇది ఇప్పటికీ కులం, మతంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రాంతాల్లో ఉర్దూ మాట్లాడతారు. చదువుతారు కూడా. నగరంలోని సైన్ బోర్డులపై ఉర్దూలో ఉండేలా చూడడంలో అధికారులు విఫలమవ్వడంపై ఉర్దూ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది భాషకు జరిగిన అన్యాయం, దీని సరిద్దాల్సిన అవసరం ఉందని వారు ప్రభుత్వానికి సూచించారు. గోల్కొండ కోట రాష్ట్రంలోని అత్యంత ముఖ్యమైన వారసత్వ కట్టడాల్లో ఒకటి, అయితే దీనికి ఉర్దూ సైన్ బోర్డు లేదు. ఉర్దూ భాషను ప్రోత్సహిస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు వాస్తవరూపం దాల్చడంలేదని.. హైదరాబాద్ మూలాలు ఉన్న చారిత్రక కోటకు ఉన్న సైన్ బోర్డుల్లోనే ఉర్దూను ప్రతిబింబించడంలో విఫలమైందని ఎత్తి చూపారు.
“ప్రభుత్వం ఉర్దూను రెండవ అధికారిక భాషగా ప్రకటించినప్పటికీ సైన్ బోర్డులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగులో పేర్లు ఉన్నాయి” అని సామాజిక కార్యకర్త ఆసిఫ్ హుస్సేన్ సోహైల్ అన్నారు. “రెండవ అధికారిక భాష కావడంతో, అనేక చారిత్రక ప్రదేశాలతో పాటు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఆర్‌టీసీ బస్సుల యొక్క రూట్ బోర్డులలో ఉర్దూ లేదు. ఉర్దూ పట్ల ఇంత వివక్ష ఎందుకు?” అని ఆయన ప్రశ్నించాడు. కుతుబ్ షాహీ, అసఫ్ జాహీ రాజవంశాల కాలంలో దక్కన్‌లో శతాబ్దాలుగా ఉర్దూ భాషకు ఆదరణ లభించినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి దారుణంగా ఉందని ఇటీవల గోల్కొండ కోటను సందర్శించిన సయ్యద్ ఇర్ఫాన్ అల్ హుస్సేనీ ఆక్షేపించారు.
ఇప్పుడు గోల్కొండ కోట ప్రాకారంపై నుంచి జెండాను ఎగురవేస్తున్న మన ముఖ్యమంత్రి కూడా దక్కన్ సంస్కృతి, సంప్రదాయాలకు, ముఖ్యంగా హైదరాబాద్‌తో ముడిపడి ఉన్న ఉర్దూ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. ఉర్దూ ప్రేమికుడు మహమ్మద్ యూసుఫుద్దీన్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఉర్దూ ఎక్కువగా మాట్లాడతారు. ఇక్కడ దక్కనీని సృష్టించడానికి ఇది ఎక్కువగా తెలుగుతో మిళితం చేయబడింది. “ఉర్దూ మాట్లాడే వారు కూడా సైన్‌బోర్డ్‌లను చూస్తారు. ఉర్దూ లేకపోవడం వారికి చాలా ఇబ్బందులు సృష్టిస్తుందని రుజువయింది. చాలా సిటీ బస్సు సైన్‌బోర్డ్‌లలో ఇప్పటికీ ఉర్దూ లేదు. ఫలితంగా ప్రయాణీకులు గమ్యస్థానాలను గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నారు. బస్‌ రూట్‌లో ఉర్దూను చేర్చాలని నేను ప్రభుత్వాన్ని, ఆర్టీసీని కోరుతున్నా అని సామాజిక వేత్త సోహైల్ తెలిపారు.
ఇప్పటికైనా ఉర్దూను ప్రోత్సహించాలనే ప్రభుత్వ ప్రకటనలు కేవలం మాటల రూపంలో కాకుండా వాటిని చేతల రూపంలో చూపేందుకు చర్యలు చేపట్టాల్సిఉంది. కాబట్టి ప్రభుత్వం, నగరపాలక సంస్థ ఇకనుంచైనా సైన్ బోర్డులలో ఉర్దూను చేర్చాలని ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ‘సేవ్ ఉర్దూ ఉద్యమాన్ని’ ప్రారంభించారు. భాషను కాపాడుకునేందుకు ప్రాంతాల వారీగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles